ఆదాయమే లేదు రుణాల మాఫీ ఎలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదాయమే లేదు రుణాల మాఫీ ఎలా?

ఆదాయమే లేదు రుణాల మాఫీ ఎలా?

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

సాలూరు, ఏప్రిల్ 1: రాష్ట్ర ఆదాయానికి మించిఉన్న రైతు, డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేస్తారో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించండని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, అలాంటప్పుడు ఆదాయానికి మించిన అప్పులను బాబు ఎలాతీరుస్తారని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన రోడ్‌షోలో.. అనంతరం జాతీయరహదారి, ప్రధాన కూడలిలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల గృహాలుండగా ఇంటింటికీ ఉద్యోగం ఎలా ఇస్తారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వైసీపీని గెలిపిస్తే తాను సీఎంగా ఐదేళ్లతో 50 లక్షల పక్కా గృహాలు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలను ఇంగ్లీషు మీడియం పాఠశాలగా మారుస్తానని చెప్పారు. మహిళలకు వెన్నుదన్నుగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబులా టీవీ, సెల్‌ఫోన్ , కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పనని, కానీ, ప్రతిఇంట్లో 150 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.100 మాత్రమే చార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. పగటిపూట రైతుకు ఏడుగంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఆచరణయోగ్యమైన హామీలనే వైసీపీ ఇస్తోందన్నారు. మనమంతా రామునిపాలన చూడలేదు గానీ, రాజన్న స్వర్ణయుగం చూశామని చెప్పారు. మళ్లీ అదేరాజన్న పాలన తాను తీసుకువస్తానని స్పష్టం చేశారు. వైసీపీని ఆదరించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: