విజయమ్మకు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మకు ఘన స్వాగతం

విజయమ్మకు ఘన స్వాగతం

Written By news on Sunday, April 13, 2014 | 4/13/2014

విజయమ్మకు ఘన స్వాగతం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు శనివారం విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి గుంటూరు వెళుతూ విజయమ్మ కొద్దిసేపు స్థానిక హోటల్ మురళీ ఫార్చ్యూన్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నాయకులు విజయమ్మను కలిసి స్వాగతం పలికారు.

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కోనేరు రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), జోగి రమేష్, పార్టీ నాయకులు గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, తాతినేని పద్మావతి, ఖాజా రాజకుమార్, మురళీ ఫార్చ్యూన్ అధినేత ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
Share this article :

0 comments: