ప్రజాసేవే సంకల్పం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాసేవే సంకల్పం

ప్రజాసేవే సంకల్పం

Written By news on Monday, April 21, 2014 | 4/21/2014

ప్రజాసేవే సంకల్పం
  • మదనపల్లెలో పుట్టా, చిత్తూరు బీజెడ్ హైస్కూల్‌లో చదివా  
  •  వైఎస్సార్ సీపీతోనే అభివృద్ధి సాధ్యం
  •  శివప్రసాద్ చేసిందేమిటో చెప్పాలి                           
  •  వేషాలూ..నాటకాలొద్దు
  •  వైఎస్సార్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్
 పెనుమూరు, న్యూస్‌లైన్: ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయూల్లోకి వచ్చానని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలు అమలుచేయడమే కాకుండా ఆయన ఆశయాలు నెరవేర్చే సత్తా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని విశ్వసించి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని ఆ పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్య కిరణ్ అన్నారు.

ఆదివారం ఆమె పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీతోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తాను చిత్తూరు జిల్లావాసినేనని, పుట్టింది మదనపల్లెలో, పదో తరగతి వరకూ చదివింది చిత్తూరు బీజెడ్ హైస్కూల్‌లోనేనని చెప్పారు. తాను స్థానికురాలినికానని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ (టీడీపీ) చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణకు చెం దిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ ప్రాంతీయురాలినని ఎలా అవుతానని ప్రశ్నించారు.

తాను ఎప్పుడూ తెలంగా ణ ఉద్యమంలో పాల్గొనలేదని, సీమాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని చెప్పారు. వేషాలు, నాటకాలు వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న శివప్రసాద్ ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందని చెప్పారు. ప్రాంతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె చెప్పారు.

20 రోజుల్లో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైఎస్సార్ సీపీకే ప్రజలు పట్టం కడతారని చెప్పారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజల కష్టాలు తీర్చే ఐదు సంతకాలు చేస్తారని చెప్పారు.
 
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కే నారాయణస్వామి మాట్లాడుతూ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని నారా చంద్రబాబునాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనను నమ్మి ప్రజలు ఓట్లు వేయడం కలలో కూడా జరగదని చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కారేటి గోవిందరెడ్డి, జంభుగోళం భాస్కర్, మండల అధికార ప్రతినిధి చింతా చెన్నకేశవులు, మండల సేవాదళ్ కన్వీనర్ దూది రవికుమార్, తాటిమాకులపల్లె లక్ష్మీపతి, మొరుం త్యాగరాజులు,పెనుమూరు వార్డు సభ్యులు మణి, గంగయ్య, భూపతినాయుడు, టైలర్ మురగ, ఎలుంగుండ్లపల్లె సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: