జగన్ ప్రభంజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రభంజనం

జగన్ ప్రభంజనం

Written By news on Sunday, April 20, 2014 | 4/20/2014

జగన్ ప్రభంజనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరుకు విచ్చేసిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పలికారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు రోడ్లపై బారులుదీరి ఘనస్వాగతం పలికారు. రాజన్న బిడ్డను ముఖ్యమంత్రి చేస్తామంటూ ఆశీర్వదించారు.  పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు సాగిన రోడ్‌షోలో వెన్నంటి నడిచారు. కాబోయే సీఎం జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం, చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం అందరినీ ఆకట్టుకుంది.. ఆలోచింపజేసింది. చివరిలో జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాలకు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో విశ్వసనీయతకే మా ఓట్లు అంటూ జనం బదులిచ్చారు.
 
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా రాపూరుకు విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన  రాపూరుకు వచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి ప్రతిచోటా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతను పలకరించేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులు రోడ్లపై బారులుదీరారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు.

పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు జగన్ రోడ్‌షో జనంతో కిక్కిరిసిపోయింది. మిద్దెలు, మేడలపై సైతం జనం కిక్కిరిశారు. సుమారు 50 నిమిషాల పాటు రోడ్‌షో సాగింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిచోటా వాహనం నిలిపి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘‘రాబోయే కాలం మనదే, మంచి జరుగుతుంది’’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. మా రాజన్న బిడ్డ మీరు.. ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటామంటూ ఆయనను జనం ఆశీర్వదించారు. ‘కాబోయే సీఎం జగన్’ అనే నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో రాపూరు కిటకిటలాడింది. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది.

చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం జనంలో ఉత్సాహం నింపింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఫ్రీగా చేస్తానని చెప్పడమేమిటని జగన్ నిలదీయడంతో ఈలలు, కేకలతో జనం స్పందించారు. బాబు తన పాలనలో రైతులు, వృద్ధులను పట్టించుకోలేదని, పేదల ఆరోగ్యం అసలు ఆయనకు పట్టలేదని జగన్ వివరిం చారు. చివరిలో జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాల కు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో విశ్వసనీ యతకే మా ఓట్లు అంటూ జనం పెద్దఎత్తున స్పందించారు.

ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నిన్ను సీఎంని చేసుకుంటామంటూ ఉత్సాహంగా ఈలలు, కేకలతో తమ అభిప్రాయం తెలిపారు. తాను సీఎం అయిన మరుక్షణమే రైతుల కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకోసం రూ. 2వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా రుణాల మాఫీ, వృద్ధుల పింఛన్ పెంపు, అమ్మఒడి పేరుతో విద్యార్థులను ఉచితంగా చదివించడం తదితర పథకాలపై సంతకాలు చేస్తానని చెప్పారు. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగిన జగన్ పర్యటనకు విశేష స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
 
మన గుర్తు ఫ్యాన్

మన గుర్తు ఫ్యాన్ గుర్తు.. ఈ విషయం గ్రామాల్లో కొంత మందికి సరిగ్గా తెలియడంలేదు. ప్రతి కార్యకర్త అందరికీ మన గుర్తు ఫ్యాన్ అని చూపించి వివరించాలని జగన్ మోహన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు దీనిని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మన గుర్తు ఏ గుర్తు అంటూ జగన్ సభకు వచ్చిన జనాన్ని ప్రశ్నించారు. దీంతో అందరూ ఫ్యాన్ అంటూ స్పందించారు.
 
వరప్రసాద్‌ను గెలిపించండి...
 తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ మంచి వ్యక్తి అని, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన ఆయన ప్రజలకు మంచి చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్‌మో హన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
ఘనస్వాగతం
 
వైఎస్సార్ జిల్లా నుంచి చిట్వేలు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: వరప్రసాద్
 
మహానేత వైఎస్సార్ లాంటి సమర్థుడైన వ్యక్తి సీఎం కావాలంటే జగన్‌ను గెలిపించుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పిలుపుని చ్చారు. విభజన పుణ్యమాని రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. తనను ఎంపీగా, లక్ష్మయ్యనాయుడుని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Share this article :

0 comments: