బాబు పాలన స్కామ్‌ల మయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పాలన స్కామ్‌ల మయం

బాబు పాలన స్కామ్‌ల మయం

Written By news on Tuesday, April 22, 2014 | 4/22/2014

బాబు పాలన స్కామ్‌ల మయం
ఏలేరు, ఐఎంజీ, ఎమ్మార్, నకిలీ స్టాంపుల
కుంభకోణాలన్నీ చంద్రబాబువేనని ఆరోపణ
కోర్టుల్లో స్టేలు తెచ్చుకుని నీతికబుర్లు చెబుతున్నారని విమర్శ

 
కాకినాడ: ‘‘తొమ్మిదిన్నరేళ్ల చంద్రబాబు పాలనంతా స్కామ్‌ల మయం. ఏలేరు, నకిలీస్టాంపులు, ఐఎంజీ భూములు, ఎమ్మార్‌కు భూములు... ఇలా ఆయన పాలనలో అడుగుకో కుంభకోణం. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించారు. నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్ తదితర సహకార చక్కెర మిల్లులను, స్పిన్నింగ్ మిల్లులను తెలుగు తమ్ముళ్లకు ధారాదత్తం చేశారు. తన హెరిటేజ్ కంపెనీకోసం ప్రభుత్వ డైరీలను మూత వేయించారు. ఇలా ఆయన తొమ్మిదేళ్ల పాలన పీడకలగా సాగింది. అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని నీతి కబుర్లు చెబుతున్నారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో దర్యాప్తునకు అంగీకరించే ైధైర్యం చంద్రబాబుకు ఉందా? తన తొమ్మిదేళ్ల పాలన తెస్తానని చెప్పి ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడిగే ధైర్యం ఉందా?’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్  గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు తూర్పుగోదావరి జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పర్యటించిన విజయమ్మ పెరుమాళ్లపురం, ప్రత్తిపాడు, గోకవరంలలో జరిగిన వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించారు.

65 ప్రభుత్వ సంస్థలను నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, రామోజీరావు, సీఎం రమేష్, మురళీమోహన్, సత్యం రామలింగరాజు వంటి డబ్బున్నవారికి కట్టబెట్టి, 26వేల మంది ఉద్యోగుల్ని, ఏడు లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేశారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని స్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చేస్తాడని హెచ్చరిం చారు. వైఎస్సార్ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తెచ్చేందుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ జనభేరిలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన విజయమ్మకు మెట్టవాసులు బ్రహ్మరథం పట్టారు. సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ అభ్యర్థులు సుబ్బారావు, దాడిశెట్టి రాజా ఆమె వెంట ఉన్నారు.
Share this article :

0 comments: