వైఎస్సార్ సీపీలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్ సీపీలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక

వైఎస్సార్ సీపీలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల చేరిక

Written By news on Saturday, April 5, 2014 | 4/05/2014

శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసానికి వచ్చినప్పుడు ఆయన్ని పలువురు నాయకులు కలిసి పార్టీలో చేరనున్నట్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరందరికీ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
 
పార్టీలో చేరిన వారిలో పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కొవగాపు సుధాకర్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు సిర్ల రామారావు, మాజీ కౌన్సిలర్లు పేర్ల ప్రకాష్, బరాటం కూర్మారావు, పిల్లల నీలాంద్రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు రెడ్డి మోహనరావు, ఎంఏ రఫీ, గన్ని రాజు, కెల్ల కొండలరావు, టెలికాం ఎడ్వయిజరీ కమిటీ సభ్యుడు డబ్బీరు వాసుదేవరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిల్లాన భోజ్‌కుమార్, పైడి మురళీ, పి. సాయి, దూసి నాగేశ్వరరావు, బి.జ్యోతి, సౌజన్య, రాధారాణి, శిమ్మ రాజశేఖర్‌లు ఉన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలాలకు చెందిన పలువురు దేశం, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
Share this article :

0 comments: