కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్‌ఎస్’ దెబ్బ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్‌ఎస్’ దెబ్బ

కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్‌ఎస్’ దెబ్బ

Written By news on Friday, April 4, 2014 | 4/04/2014

కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్‌ఎస్’ దెబ్బ
 దేశంలోనే ఇదో వినూత్న కార్యక్రమం.. ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్‌ఎస్) గురించి ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి మధ్యలోనే మంగళం పాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకోసం ఎంచుకున్న ఈ విధానం స్వయంగా తనకే షాకివ్వడంతో కంగుతిన్న చంద్రబాబు దానిని మధ్యలోనే అటకెక్కించారు. అభ్యర్థుల ఎంపికకోసం తలపెట్టిన ఈ ప్రయోగం స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో వికటించింది. టీడీపీ అధినేత వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఆయన ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి.
 
 ఇక్కడినుంచి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ.. సెల్‌ఫోన్ ఉన్నవారిని ఐవీఆర్‌ఎస్ ద్వారా సమాధానం పంపాల్సిందిగా కోరారు. అయితే ఇప్పటివరకు ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు 40 శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా సమాధానం పంపినట్టు సమాచారం. దీంతో ఇదేదో విక టించేటట్లు ఉందన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ గురించి మాట్లాడ టం ఆపేశారు. సాధారణంగా ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం.. దానిని మధ్యలోనే వదిలేయడం టీడీపీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ కోవలోకి ఐవీఆర్‌ఎస్ చేరింది.  ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఈ విధానాన్ని దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ దానిపై విస్తృత ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రచారం చేసుకున్నన్ని రోజులు కూడా దాన్ని కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీన్ని కొనసాగించినన్ని రోజులు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశిస్తున్న వారిపేర్లు కాకుండా వేరేవారి పేర్లు ఫోన్‌లో వినిపించాయి. దీంతో కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తనదాకా వస్తేగానీ తెలియదన్నట్టు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఈ ప్రయోగం వికటించటంతో చంద్రబాబు ఐవీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఐవీఆర్‌ఎస్ ప్రకటనలు ఆగిపోయాయి.
Share this article :

0 comments: