ఐకేపీ సిబ్బందికి బాసటగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐకేపీ సిబ్బందికి బాసటగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్..

ఐకేపీ సిబ్బందికి బాసటగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్..

Written By news on Wednesday, April 16, 2014 | 4/16/2014

ఐకేపీ సిబ్బందికి బాసటగా     వైఎస్‌ఆర్ కాంగ్రెస్..
దశలవారీగా ఉద్యోగాల రెగ్యులరైజ్
మేనిఫెస్టోలో స్పష్టం చేసిన అధినేత
మహానేత హామీకి జగనన్న భరోసా
వెట్టిచాకిరీ చేయించిన గత ప్రభుత్వాలు

 
 అధికారంలో ఉన్నాం కదా అని ఐకేపీ ఉద్యోగులతో గత పాలకు లు వెట్టిచాకిరీ చేయించుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇదే నిర్వాకాన్ని కొనసాగించాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సభలకు మహిళలను సమీకరించి తరలించడమే పనిగా ఐకేపీ ఉద్యోగులను వాడుకున్నాయి. ఇపుడు పనిభారంతో, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతకు నోచుకోని ఐకేపీ ఉద్యోగులకు తాము అండగా ఉంటామంటూ వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

 మోర్తాడ

 ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆంశాన్ని వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐకేపీ ఉద్యోగుల విష యం స్పష్టంగా ఉంది. తమ డిమాండ్‌లను పరిష్కరించడానికి ఏ పార్టీ హామీ ఇస్తుందో, ఆ పార్టీకి తాము మద్దతు ఇస్తామంటూ ఐకేపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించడం విశేషం.

ఎన్నో కుటుంబాలకు మేలు


 వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో అమలైతే జిల్లాలో ఎన్నో కుటుంబాలు బాగుపడనున్నాయి. జిల్లాలో ఐకేపీలో మానవ వనరుల పరిధిలో బీపీఎం, ఏపీఎం, సీపీ ఎం, ఇతర ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 306 మంది ఉన్నారు. పట్టణ, మండల కేంద్రాలలోని కార్యాలయాలలో అకౌంట్స్, కంప్యూటర్ ఆపరేటర్‌లుగా పనిచేస్తున్న వారు 72 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో వీఓఏలుగా 900 మంది  పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చా రు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టనున్న ‘అమ్మఒడి’ పథకాన్ని ఐకేపీ ద్వారానే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనిద్వారా ఐకేపీ కార్యాలయాలు శాశ్వ తంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది.

 ‘వెలుగు’ నుంచి ఐకేపీగా

 2001లో అధికారంలో ఉన్న టీడీపీ ‘వెలుగు’ పేరుతో మండలానికి ఒక కార్యాలయాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాలన్నింటిని ఏకం చేసింది. మహిళలకు రుణాలు ఇవ్వడం, పొదుపు చర్యలను చేపట్టారు. అయితే, టీడీపీ ప్రభుత్వం ‘వెలుగు’ పరిధిలోని మహిళలకు రుణాల పేరుతో అరచేతిలో వైకుంఠాన్ని చూపింది. రుణాలు ఇప్పించి వారిని తమ రాజకీయ సభలకు జేజేలు పలికేందుకు వినియోగించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత  సీఎం
 
 వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ‘వెలుగు’ సంస్థను ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చారు. మహిళలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి పావలా వడ్డీకి రుణాలను ఇప్పించారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ఆంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన మరణంతో ఐకేపీ ఉద్యోగుల ఆశలు నెరవేరలేదు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత సీఎం లుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఐకేపీ ఉద్యోగులను తమ సభలకు మహిళలను సమీకరించేవారిగానే పరిగణించారు. అనేక మార్లు ఐకేపీ ఉద్యోగులు ఆం దోళనలు చేసినా వారి సమస్యలను పెడచెవిన పెట్టారు. వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టో రూపొందించకముందే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఐకేపీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్‌రెడ్డి, గురురాజ్ కలిశారు. తమ సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన ఐకేపీ ఉద్యోగులకు పూర్తి భరోసా ఇస్తూ మేనిఫెస్టో లో రెగ్యులరైజ్ ఆంశాన్ని చేర్చారు. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే తమ బాధను అర్థం చేసుకుని మేనిఫెస్టోలో పెట్టిందని ఐకేపీ ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
Share this article :

0 comments: