ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం.

ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం.

Written By news on Monday, April 14, 2014 | 4/14/2014

ఒక హక్కుగా ..ఒక బాధ్యతగా.. ఓటడుగుతున్నాం.
 వైఎస్సార్‌సీపీ తెలంగాణ మేనిఫెస్టో
 
 తెలంగాణ అభివృద్ధి వైఎస్ పుణ్యమే చంద్రబాబు పరిపాలనలో వల్లకాడు  టీఆర్‌ఎస్, బీజేపీలకు పాలన చరిత్ర లేదు టీడీపీ, కాంగ్రెస్ తమ పాలనను చెప్పుకోలేవు  పగటికలల సౌధాలతో మభ్యపెడుతున్నాయి  జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల  విద్య, వైద్య రంగాల సమగ్రాభివృద్ధి
 
 ‘‘అభివృద్ధి-సంక్షేమం. ఇవి రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. మిగతా పార్టీలకు, వైఎస్సార్‌సీపీకి మధ్య అనేక తేడాలున్నాయి. తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న మిగతా పార్టీలన్నీ చిటికెల పందిరి వేస్తున్నాయి. పగటికల సౌధాన్ని చూపెడుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ రెండూ తమ పాలనలో తెలంగాణ బాగుపడిందన్న నినాదంతో ప్రజల ముందుకు రావడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇక టీఆర్‌ఎస్, బీజేపీలకు పాలించిన చరిత్రే లేదు. వైఎస్సార్ హయూంలోనే మొత్తం తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందింది. అందుకే....

 ఆ అభివృద్ధిని చూపి ఓటు అడుగుతున్నాం...

 
 ప్రజలకు, పల్లెలకు మేలు చేసిన చరిత్రతో ఓటడుగుతున్నాం...
 ఒక హక్కుగా ఓటడుగుతున్నాం. ఒక బాధ్యతగా ఓటడుగుతున్నాం.
 ఇది మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి జీవితాన్నీ
 మంచిగా మలచిన పార్టీగా అడుగుతున్న ఓటు’’    - వైఎస్సార్‌సీపీ
 
 తొలి సంతకాలివే...
 
 ముఖ్యమంత్రిగా తాను తొలి సంతకాలు చేయబోయే పథకాలు, విధానాల గురించి జగన్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే..
     
 ‘అమ్మ ఒడి’తో అక్కాచెల్లెళ్లకు భరోసా
 
 క్కాచెల్లెమ్మల కోసం తొలి సంతకం పెట్టబోతున్నా. పూట గడవడానికి పనులకు పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతముంది. ఒక్క రోజు కూలికెళ్తే రూ.100-150 వస్తుంది. దాంతో మూడు రోజులు గడిచిపోతుంది. నాలుగో రోజు పనికెళ్లకపోతే పూట గడవదు. పిల్లలను కూడా పన్లోకి తీసుకెళ్తే మరో రూ.50 వస్తాయి కదా అనుకునే పరిస్థితి. అలాంటి అక్కాచెల్లెళ్ల జీవితాన్ని మార్చేలా మొదటి సంతకం చేయబోతున్నా. వారు చేయాల్సింది తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపడమే. వారిని డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్ల వంటి పెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. అలా బడికి పంపిన అక్కాచెల్లెళ్లకు ఒక బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.1000 ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నా. పిల్లలు పై చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల్లో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్నదే నా ఆశ.
     
 రూ.700 పించన్
 
 అవ్వా తాతల కోసం మంచి మనవడిలా రెండో సంతకం పెట్టబోతున్నా. వయసు, శరీరం సహకరించకపోతున్నా అవ్వాతాతలు పనికి పోతున్నారు. నేను చాలా గ్రామాల్లో వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తే, ‘నాయనా, మీ నాయన పుణ్యంతో ఇస్తున్న రూ.200 పింఛను ఒక పూట భోజనానికే సరిపోతోంది. రెండు పూటలా తినాలంటే పనికి పోవాలి కదా’ అంటున్నారు. అలాంటి అవ్వాతాతలకు భరోసా ఇస్తూ.. దివంగత మహానేత పై నుంచి చూసి గర్వపడేలా రూ.200 పింఛన్‌ను రూ.700 చేస్తా.
     
 రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
 
 మూడో సంతకం రైతన్నల కోసం. రైతులు రేయింబవళ్లు కష్టపడి పంటలు పండిస్తున్నా మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర దొరక్క సతమతమవుతున్నారు. పండిన పంట ధర కాస్తా, వారు అమ్ముకున్న రెండు మాసాలకే రెండింతలవుతోంది. ఇక మీదట రైతన్నలు మద్దతు ధర కోసం ఆందోళన చెందాల్సిన పని లేదు. వారిలో భరోసా నింపేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధరపై భరోసా ఇస్తా.
   
 డ్వాక్రా రుణాలు రద్దు

 
 నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసమే. డ్వాక్రా రుణాలకు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వాయిదా కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. దాంతో తమ పిల్లలను కూడా పనిలోకి తీసుకెళ్తున్న దుస్థితి. అందుకే వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇస్తున్నా. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాన్ని కిందా మీదా పడైనా తీరుస్తా.
 
 ఏ కార్డు అయినా 24 గంటల్లోనే
 
 ఏ వార్డుకు, గ్రామానికి వెళ్లినా, ‘అన్నా మాకు ఇల్లు లేదు, రేషన్‌కార్డు లేదు, పెన్షన్ లేదు’ అని చెబుతున్నారు. ఏ కార్డు కావాలన్నా నాయకుల చుట్టూ తిరగక్కర్లేకుండా మీ గ్రామంలోనే, మీ వార్డులోనే ఒక కార్యాలయం, అందులో కంప్యూటర్, ప్రింటర్ వంటి వన్నీ పెట్టి 24 గంటల్లో ఏ కార్డయినా అందించేలా ఐదో సంతకం పెట్టబోతున్నా.
 
 
 ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు...
 
మీ ఇంట ప్రతి ఒక్కరి భవితకు, తెలంగాణలో మరో చరిత్రకు మేలిమలుపు!’’ అని తెలంగాణ మేనిఫెస్టోలో వైఎస్సార్‌సీపీ పేర్కొంది. చంద్రబాబు పాలనలో తెలంగాణ ఎలా వల్లకాడుగా మారిందో మేనిఫెస్టో వివరించింది. వైఎస్సార్ హాయంలో తెలంగాణను అభివృద్ధి చేసిన విధానాన్నీ పేర్కొం ది. విభజన బిల్లులో పేర్కొన్న అన్ని హామీలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తమకు ఓట్లు వేయాలని... అభివృద్ధి-సంక్షేమం అనే రెండు నినాదాలతో ముందుకు సాగుతామని పేర్కొంది. హైదరాబాద్‌కు నౌకాశ్రయంతో అనుసంధానం కోసం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం దాకా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రతిపాదిస్తున్నట్టు వివరించింది.
 
 బాబు హయాంలో బోసిపోయిన పల్లెలు...
 
 బాబు తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ పల్లెలన్నీ కన్నీరు పెట్టాయని వివరించింది. ‘‘పంటలు పండక, తిండి లేక, కూలీ చేద్దామన్నా పనులు లేక... దారుణ పరిస్థితులుండేవి. ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక బతుకు జీవుడా... అంటూ పల్లె ప్రజలు పొట్ట చేతపట్టుకుని పిల్లాజెల్లతో ముంబై వంటి నగరాలకు వలసలు వెళ్లారు. దుబాయి లాంటి గల్ఫ్ దేశాలకూ వెళ్లారు. ఎందుకంటే బాబు పాలనలో తాగటానికి నీరుండేది కాదు. పైర్లకు సాగునీరు లేదు. వ్యవసాయ బోర్లకు కరెంటుండేది కాదు. ఆ పరిస్థితుల్లో కూడా కరెంటు చార్జీల పేరుతో రైతులను, ప్రజలను బాబు పీల్చి పిప్పి చేశారు. కరువొచ్చి తినడానికి తిండిలేని దయనీయ పరిస్థితుల్లో రైతులుంటే, వ్యవసాయ బోర్లకు కరెంటు బిల్లులు చెల్లించాలంటూ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరీ పోలీసులతో ఒత్తిళ్లు చేయించారు. 14 వేల మంది రైతులపై కేసులు పెట్టించారు. దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టించారు. బిల్లులు కట్టకుంటే గ్రామాలపై పడి రైతుల ఇళ్లల్లో చెం బూ, తపేలా కూడా తీసుకుపోయారు. ఆ అవమానం భరించలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని పేర్కొంది.

 వైఎస్సార్ హయాంలో బంగారు తెలంగాణ

 
 తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ వైఎస్ మేలు చేశారని మేనిఫెస్టో గుర్తుచేసింది. ‘‘వైఎస్సార్ ఏనాడూ రాయలసీమ నాయకుడు అనిపించుకోలేదు. ఇంటింటి మనిషిగా పరిపాలన చేశారు. అందుకే వైఎస్‌ఆర్ హఠాన్మరణంతో ఎక్కువగా తెలంగాణ బిడ్డలే గుండె ఆగి మరణించా రు. తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను దగ్గరగా చూడబట్టే వైఎస్ అధికారం చేపట్టగానే ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే రైతు రుణాల మాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, సాగుకు 7 గంటల ఉచిత విద్యుత్, జలయజ్ఞం పథకాలను అమలు చేశారు. జలయజ్ఞం కింద శ్రీకారం చుట్టిన 86 ప్రాజెక్టుల్లో సగం తెలంగాణలోనే ఉన్నాయి. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, అలీసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, కొయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలతో పాటు మరె న్నో ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆయన ఉండగా చకాచకా జరిగాయి. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు కూడా సంపాదించారు. కానీ ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఇప్పటి పాలకుల్లో లోపించడం వల్లే ఏ ప్రాజెక్టూ ముందుకు సాగడం లేదు’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది.
 
 హామీలన్నీ అమలు చేయాల్సిందే...
 
విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో డిమాండ్ చేసింది. అవి...
 
  1.    రెండు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం టాక్స్ ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం
 2.    రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా గిరిజన వర్సిటీలు
 3.    తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ
 4.    4 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్కేంద్రం
 5.    ఖమ్మం జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం
 6.    తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
 7.    హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ముఖ్యనగరాలకు ర్యాపిడ్ రైలు, రోడ్డు కనెక్టివిటీ
 
 చరిత్ర వూర్చిన వైఎస్
 
 ఉచిత విద్యుత్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల వ్యవసాయ పంపు సెట్లుంటే, వాటిలో 17 లక్షలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ, 32 లక్షల మంది రైతులకు రూ.5,000 చొప్పున ప్రోత్సాహక రాయితీ.... ఈ మూడు నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు అప్పుల ఊబిలో నుంచి బయట పడగలిగారని పేర్కొంది. ‘‘జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా వైఎస్ న ల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్లలో వర్సిటీలు నెలకొల్పారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ, మెదక్ జిల్లా కందిలో ఐఐటీ ఏర్పాటు చేసింది బాబు చక్రం తిప్పడం వల్ల కాదు, వైఎస్సార్ ఒత్తిడి తీసుకురావడం వల్ల మాత్రమే! దేశంలోనే తొలిసారిగా మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటైంది. బీబీనగర్ వద్ద నిమ్స్ విశ్వవిద్యాలయం, వరంగల్‌కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆదిలాబాద్‌కు వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగాయి. దేశంలోనే తొలిసారిగా గిరిజనులకు దాదాపు 13 లక్షల ఎకరాల భూమిని పట్టాలిచ్చి పంపిణీ చేసిందీ అప్పుడే’’ అని మేనిఫెస్టో గుర్తు చేసింది.
 
 వ్యవసాయానికి ఇద్దరు మంత్రులు
 
 రాష్ట్రంలో ఇద్దరు వ్యవసాయ మంత్రులను నియమిస్తామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో పేర్కొంది. ఒకరు వ్యవసాయోత్పత్తులను, మరొకరు పంట నిల్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించింది. వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం అదనంగా 40 లక్షల చదరపు అడుగుల మేర గిడ్డంగుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది.
 
 సహకార ఉద్యమ పద్ధతిలో సాగు
 
 ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినా ప్రతి ఎకరాపై రైతుకు లభించే ఆదాయం మా త్రం పెరగడం లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒకట్రెండు గ్రామాలను ఎన్నుకుని వాణిజ్య బ్యాం కుల మద్దతుతో సమీకృత విధానం ద్వారా సహకారోద్యమ పద్ధతిలో సాగును ముందుకు తీసుకెళ్తాం. ప్రతి రైతుకూ వ్యవసాయంపై కనీస రాబ డులు, ఆదాయం వచ్చేలా చేసేందుకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేసింది.

 జాతీయ ప్రాజెక్టుగా ప్రాణహిత-చేవెళ్ల

 
 కొండల్ని సైతం తొలిచి తెలంగాణలో సాగునీటి సదుపాయం కల్పించేందుకు వైఎస్సార్ భగీరథ ప్రయత్నం చేశారని మేనిఫెస్టో గుర్తు చేసింది. ఆయన మరణానంతరం ఆగిపోయిన, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, దాన్ని కేంద్రమే చేపట్టేలా ఒత్తిడి తెస్తామని ప్రకటించింది.
 
 ప్రాచీన ఆలయాల అభివృద్ధి
 
 తెలంగాణలో ముఖ్యమైన, చారిత్రక ప్రాధాన్యమున్న వేములవాడ, యాదగిరిగుట్ట, బాసర, కొలనుపాక జైన్ మందిర్, కొండగట్టు, కాళేశ్వరం, పాకాల, అలంపూర్, రామప్ప వంటి ఆలయాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవరం ప్రాజెక్టు, చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులు, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్లను సుందర పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని పేర్కొంది.
 
విద్యుత్ యజ్ఞం

 తెలంగాణలో వెలుగులు నింపేందుకు విద్యుత్ యజ్ఞాన్ని చేపడతామని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ప్రకటించింది. ‘‘చిన్నపాటి జల, పవన, సౌర విద్యుత్కేంద్రాల వంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేస్తాం. కరీంనగర్‌లో 700 మెగావాట్లు, శంకర్‌పల్లిలో 1,000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు వరంగల్‌లో చెరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు థర్మల్ ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ ప్లాంట్లు, ఎన్టీపీసీ తలపెట్టిన 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’’ అని ప్రకటించింది.
 వైఎస్సార్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ఇప్పుడు దాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని మేనిఫోస్టో ఆకాంక్షించింది. వచ్చే పదేళ్లల్లో అక్షరాస్యత రేటును 99 శాతానికి పెంచేందుకు ఉద్యమంలా ఒక కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల విద్యా, ఆరోగ్యాల కోసం మందులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితో కూడిన 20 మొబైల్ హెల్త్ వాహనాలు, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ ప్రమాణాలున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పింది.

 రూ.100కే 150 యూనిట్ల విద్యుత్

 నెలకు 150 యూనిట్ల లోపు వాడకముండే గృహ వినియోగదారులందరికీ కేవలం 100 రూపాయలకే విద్యుత్ సరఫరా చేస్తామని వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో కోటి 76 లక్షల మందికిపైగా లబ్ధి చేకూరనుంది. పెరగబోయే చార్జీలతో లెక్కిస్తే వారు ప్రస్తుతం రూ.600కు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
 
మర మగ్గాలకు యూనిట్‌కు  1.5 రూపాయలకే కరెంటు
 
ప్రస్తుతం కాటేజీ పరిశ్రమల కింద వచ్చే మర మగ్గాల చేనేత కార్మికులకు యూనిట్ విద్యుత్ ధర రూ.3.75 ఉంది. దాన్ని రూ.4.42కు పెంచేందుకు ఇప్పటికే ఈఆర్‌సీ వద్ద ప్రతిపాదనలున్నాయి. ఎన్నికలు ముగియగానే చార్జీలు పెరగనున్నాయి. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే యూనిట్ చార్జీని రూ.1.5కి తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రార్థనా మందిరాలు, మతపరమైన ఆరాధన కేంద్రాలను కూడా ప్రస్తుతం వాణిజ్య సంస్థలుగానే పరిగణించి యూనిట్‌కు రూ.4.72 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై వాటినీ గృహ వినియోగ కేటగిరీ కిందే పరిగణిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
 
Share this article :

0 comments: