రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన మేనిఫెస్టో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన మేనిఫెస్టో!

రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన మేనిఫెస్టో!

Written By news on Sunday, April 13, 2014 | 4/13/2014

రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన మేనిఫెస్టో!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ విధంగా ఆయన తొలి విజయం సాధించారు. రాష్ట్ర ప్రజల  గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు పునాది వేసుకున్నారు.  అది చేస్తాను, ఇది చేస్తాను అని ఎడాపెడా హామీలు ఇవ్వలేదు. ఆచరణకు అనువైన, అద్భుతమైన పథకాలు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనవైపు చూసే విధంగా చేశారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే పాలన అందిస్తానని, అది ఎలా చేస్తానో కూడా ఆయన చాలా స్పష్టంగా వివరించారు. అందరికీ అర్ధమైయ్యే రీతిలో ప్రతి అంశం వివరంగా చెప్పారు.

తన తండ్రి, ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కన్న కలలను నిజం చేసే విధంగా ఆయన తన పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు. తను చనిపోయిన తరువాత కూడా ప్రతి ఇంట్లో తన తండ్రి ఫొటో, తన ఫొటో ఉండే విధంగా పాలన అందిస్తానని చెప్పారు. జగన్ సంపన్న కుటుంబంలో పుట్టి అలాగే పెరిగారు. ఇంతకు ముందు పేదల బాధులు తెలుసో తెలియదో మనకు తెలియదు. అయితే ఆయన ఓదార్పు యాత్రలోభాగంగా గానీ, మరో రకంగా గానీ గత నాలుగేళ్లలో రాష్ట్రం నలుమూలల పర్యటించారు. ప్రతి పల్లెకు వెళ్లారు. మారుమూల గ్రామాలకు వెళ్లారు. పొలాల్లోకి వెళ్లారు. పేదవాడి ఇంట్లోకి వెళ్లారు. వారు ఎలా బతుకుతున్నారో, ఏం తింటున్నారో, ఏం బాధలు పడుతున్నారో అతి దగ్గరగా చూసి తెలుసుకున్నారు. అవ్వలను, అక్కలను, చెల్లెళ్లను, తమ్ముళ్లను, బాలబాలికలను  పలకరించారు. అడిగిమరీ వారి కష్టాలను తెలుసుకున్నారు. వారి బతుకుని, బాధలను దగ్గరగా చూశారు.  తెలియని అంశాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వారి జీవితాలు, జీవనం విధానం తెలుసుకున్నారు. ప్రతి చోట వారు పడే బాధలు, వారి సారూప్యత, పాలనలో లోపాలు అర్ధం చేసుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జగన్ మాట్లాడిన తీరు, అతను చెప్పిన వివరాలు, ప్రకటించిన పథకాలు, అమలు చేస్తానని చెప్పిన అంశాలు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇంతకు ముందు ఏ పార్టీ గానీ, ఏ నేత గానీ మేనిఫెస్టోని సామాన్యుడికి కూడా అర్ధమయ్యే విధంగా ఇంత స్పష్టంగా చెప్పాలేదు. టివిలలో ప్రత్యక్ష ప్రసారం చూసిన అందరికీ ఈ విషయం అర్ధమయ్యే ఉంటుంది. రాష్ట్ర చరిత్రలో మనం ఇంతవరకు ఇటువంటి మేనిఫెస్టోని చూడలేదంటే అతిశయోక్తి కాదు.

తన తండ్రి రాష్ట్రానికి అందించిన స్వర్ణ యుగం మళ్లీ తెస్తానని జగన్ చెప్పారు. అది ఎలా తెస్తానో కూడా చాలా వివరంగా చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం, దాని అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు - పారిశ్రామిక రంగ వృద్ది - ఉద్యోగ అవకాశాల కల్పన - 2019 నాటికి విద్యుత్ కోతలేని రాష్ట్రం రాష్ట్రంగా మార్చడం - ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు -  ఆరోగ్యశ్రీ పథకం విస్తరణ - వైద్యం - విద్య- సేవారంగాలకు ప్రాధాన్యత -  పారదర్శక పాలన

చట్టాలు, పథకాలు రూపొందించే సమయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తీసుకునే జాగ్రత్తలను కూడా ఆయన వివరించారు. రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, ఆరోగ్యశ్రీకార్డు, కుల,ఆదాయ,నివాస ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు పడే పాట్లు జగన్ కు బాగా అర్ధమయ్యాయి. అందుకోసమే అధికారంలోకి వచ్చిన మొదటి రోజున పెట్టే 5వ సంతకం పౌర సేవలకు సంబంధించినదిగా చెప్పారు. ప్రతి పౌరుడికి తనకు కావలసి ప్రతి కార్డుని 24 గంటలలో అందించే విధంగా వారి వారి గ్రామాల్లోనే  కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500 చొప్పున తల్లి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ. ఒక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే రూ.1000 జమ.
   ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాక్షికంగా గాక మొత్తం ఫీజు చెల్లింపు
   వృద్ధులకు రూ.700 ఫించన్‌ చెల్లింపు
    20 వేల కోట్ల రూపాయిల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ. రుణ విధానంలో మార్పులు.
ఆరోగ్యశ్రీ పథకంలో తొలగించి వ్యాధులు చేర్చడం. మరిన్ని సౌకర్యాలు పెంచడం.
    నియోజకవర్గంలో ఒకచోట మాత్రమే మద్యం అమ్మకం
    ప్రతి నియోజకవర్గంలో వృద్దాశ్రమం, అనాదాశ్రమం
    ఆ తరువాత మండల కేంద్రాలకు ఆశ్రమాల విస్తరణ
    వంటగ్యాస్‌పై రూ.100 సబ్సిడీ

రైతుల కోసం:  రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాల సహాయనిధి ఏర్పాటు - ఈ నిధి నుంచి రైతులను తక్షణమే ఆదుకుంటాం - అధికారంలోకి రాగానే రెండు జిల్లాలకు ఓ వ్యవసాయ కాలేజీ - మూడు అగ్రికల్చర్‌, వెటర్నరీ యూనివర్శిటీల ఏర్పాటు - ప్రతి మండల కేంద్రంలో 102 మొబైల్ టీమ్‌ సర్వీస్‌ - ఫోన్‌ చేసిన ప్రతీరైతుకు 20 నిమిషాల్లో సేవలు - ప్రతిమండల కేంద్రంలో 103 మొబైల్ టీమ్ సర్వీస్‌

రాజధాని నిర్మాణం:  హైదరాబాద్‌ను మించిన నగరం నిర్మాణం - 20 ఫాకల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు -   2019 నాటికి విద్యుత్ కొరత లేని రాష్ట్రం -  కొత్తగా కట్టే నగరంలో అన్ని సౌకర్యాలు -  ప్రతి జిల్లాలో ఎయిర్‌పోర్ట్ -  అన్నిచోట్ల రేడియల్ రోడ్స్‌ -  శ్రీకాకుళం నుంచి బెంగళూరు, చెన్నైకి 8వే కారిడార్‌ -  ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్టోరేజ్‌, ప్యాకేజింగ్ సౌకర్యం -  కాలుష్యం లేని నగరంగా విశాఖ -  పెట్రో యూనివర్శిటీ ఏర్పాటు - పెట్రోలియం సెక్టర్‌లో ఉపాధి అవకాశాలు - పేదలకు కట్టిచ్చే ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు  -  ఆ ఇళ్లపై పేదలకు పూర్తి హక్కు -అవసరమైతే ఆ ఇళ్లపై పావలా వడ్డీకే రుణాలు -    వైఎస్‌ఆర్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ - విశాఖలో మెట్రో రైలు -    విశాఖ, తిరుపతి, విజయవాడల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు

పారదర్శక పాలన: అవినీతికి తావులేని విధంగా పారదర్శక పాలన -పాలన వ్యవస్థలో వేగం -    నిర్ణయాలు, పథకాల అమలుకు ముందే ప్రభుత్వం హైకోర్టు వద్దకు వెళ్లడం, కాగ్‌ను ఆశ్రయించడం.-   కోర్టు సూచనల మేరకు మార్పుల తరువాత అమలు - నిరుపేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం.

గ్రామాల్లోలే ప్రభుత్వపాలన: ప్రతిగ్రామంలో ఒక ఆఫీస్‌ ఏర్పాటు -  ఏకార్డు కావాలన్నా 24గంటల్లో జారీ
   స్థానికుల్లో పది మంది మహిళలకు ఆఫీస్‌ బాధ్యతలు -వారే గ్రామంలో ఆడపోలీసులు -  బెల్ట్‌షాపులపై నిఘా - పీఎహెచ్‌సీలు, స్కూల్స్, పీడీఎస్, పెన్షన్లు మానిటరింగ్ -20 వేల పంచాయతీల్లో 2లక్షల మంది మహిళలకు ఉపాధి - ఐదేళ్లలో 50లక్షల ఇళ్లు - రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేద ఉండకూడదు..అదే లక్ష్యం
  
ఆరోగ్యశ్రీ పథకం: ఈ పథకంలో నుంచి తొలగించిన వ్యాధులను చేర్చడం - సౌకర్యాలు పెంచడం - ఆపరేషన్ అయినవారికి వైద్యులు చెప్పిన ప్రకారం వారు విశ్రాంతి తీసుకున్నంత కాలం  నెలకు రూ.3వేల రూపాయల చెల్లింపు.- ప్రతి జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి

ఉద్యోగుల కోసం : ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్‌సీ - కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై కమిటీ - అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సర్వీస్ రెగ్యులరైజేషన్ - ప్రతి ఉద్యోగికి పక్కాఇల్లు
Share this article :

0 comments: