కొనసాగిన వైఎస్ఆర్ సిపి హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొనసాగిన వైఎస్ఆర్ సిపి హవా

కొనసాగిన వైఎస్ఆర్ సిపి హవా

Written By news on Sunday, April 6, 2014 | 4/06/2014

కొనసాగిన వైఎస్ఆర్ సిపి హవా
హైదరాబాద్: మునిసిపల్, నగరపాలక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోరు చూపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం జరిగిన మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో కూడా అదే హవా కొససాగించింది. సీమాంధ్ర 13 జిల్లాల్లో 5084 ఎంపీటీసీలు, 354 జడ్‌పీటీసీలకు ఆదివారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే దాదాపు అన్ని చోట్ల వైఎస్ఆర్ సిపి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పశ్చిమగోదావరి, కష్ణా జిల్లాలో తప్ప తెలుగుదేశం పార్టీ మరెక్కడా గట్టి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు.

ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోలింగ్ వైఎస్ఆర్ సిపికి   ఏకపక్షంగా సాగినట్లు రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఇక రాయలసీమలో ఒక్క అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తప్పితే తెలుగుదేశం పార్టీ పోటీలో ఉన్నట్టే కనిపించలేదు. తమకు ఓట్లు పోలవడం లేదని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో పాటు ఓటర్లపైనా దాడులకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓటమిని గమనించిన టీడీపీ కార్యకర్తలు నిరాశ నిస్పహలకు లోనై వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై దాడి చేశారు. వారిని గాయపరిచారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని పోలింగ్ సరళిని పరిశీలించిన ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ఈ జిల్లాల్లో 54 జడ్‌పీటీసీలకు ఎన్నికలు జరుగగా, 35 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 రాయలసీమలో కూడా వైఎస్ఆర్ సిపికి ఏకపక్షంగానే సాగింది.  ఒక్క అనంతపురం జిల్లాలో మినహా మూడు జిల్లాల్లో వైఎస్సార్‌సీసీ జోరు స్పష్టంగా కనిపించింది. అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ, టీడీపీ హోరాహోరిగా తలపడ్డాయి.  మొత్తం 354 జడ్‌పీటీసీల్లో దాదాపు  250 జడ్‌పీటీసీలను వైఎస్ఆర్ సిపి గెలుచుకునే అవకాశం ఉంది.  మూడింట రెండొంతుల మండల పరిషత్ అధ్యక్షసానాలతో పాటు 13 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంటామని ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కోఆర్డినేటర్  కొణతాల రామకృష్ణ చెప్పారు.


Share this article :

0 comments: