రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు

రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు

Written By news on Saturday, April 19, 2014 | 4/19/2014

'రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు'వీడియోకి క్లిక్ చేయండి
రైల్వే కోడూరు : ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వేకోడూరులో వైఎస్ఆర్ జనభేరిలో  మాట్లాడుతూ అన్ని ఫ్రీగా ఇస్తానని, రుణాలు మాఫీ చేస్తానంటూ నిస్సిగ్గుగా బాబు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ... రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో మీకు తెలుసా .... అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అధికారం కోసం చంద్రబాబు దొంగ్ హామీలు ఇస్తున్నారని, ఆయనలా నిజాయితీ లేని రాజకీయాలు తాను చేయలేనని వైఎస్ జగన్ అన్నారు. బాబులా అబద్ధాలు చెప్పలేను అని...వైఎస్ఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతేనని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర చరిత్రను మార్చే అయిదు సంతకాలు చేస్తానని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు భరోసా ఇస్తున్నానని, మీ పిల్లవాడ్ని బడికి పంపించండని సూచించారు. అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు తెచ్చేలా 'అమ్మ ఒడి' పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని వైఎస్ జగన్ తెలిపారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అన్నారు.

తాను సీఎం అయ్యాక అయిదు సంతకాలు చేస్తానని  జగన్‌ చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర చరిత్రను మారుస్తాయన్నారు. అక్కా చెల్లెళ్ళ కోసం మొదటి సంతకం అమ్మఒడి పథకంపై పెడతానన్నారు. ఈ పథకంతో పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తానన్నారు.  ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెట్టిస్తానన్నారు. రెండవ సంతకం అవ్వా, తాతలకు. రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ చేస్తానన్నారు. మూడవ సంతకంగా రైతులకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఏడాదికి 10లక్షల ఇళ్లు నిర్మిస్తానని, అయిదేళ్లలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పారు.
Share this article :

0 comments: