శోభానాగిరెడ్డి చివరి ఇంటర్వ్యూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శోభానాగిరెడ్డి చివరి ఇంటర్వ్యూ

శోభానాగిరెడ్డి చివరి ఇంటర్వ్యూ

Written By news on Thursday, April 24, 2014 | 4/24/2014

జగన్ ను సీఎంగా చేయాలని ప్రజల్లో పట్టుదల: శోభానాగిరెడ్డివీడియోకి క్లిక్ చేయండి
కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత భూమా శోభానాగిరెడ్డి ఆకస్మిక మరణం చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాగలమర్రులో సాక్షి టెలివిజన్ తో మాట్లాడారు. ప్రజా సమస్యలపై శోభానాగిరెడ్డి స్పందన ఆమె మాటల్లోనే ..
 
'రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. ప్రజల్లో ఉత్సాహం ఉంది. ప్రజల్లో ఉత్సాహం చూసి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఆళ్గగడ్డలోనూ అలాంటి పరిస్థితి ఉంది. రాష్ట్రమంతటా అదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. 
 
రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పేద ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. పెన్షన్లు అందడం లేదని ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. చార్జీలు పెంచారు. పంటలకు ధరలు లేవు. ప్రజలకు బతకలేని పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలను ప్రజలు ఏకరువు పెడుతున్నారు. అయితే నెల ఓపిక పట్టండి. ప్రజా సమస్యలు తీరుతాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు తీరుతాయనే విశ్వాసాన్ని నింపుతున్నాం. వైఎస్ జగన్ ఆరు సంతకాలే సమస్యలన్నింటికి పరిష్కారం చూపుతాయని చెబుతున్నాం. 
 
ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత రెండు నెలలకే మహానేత చనిపోయారు. ఆతర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనడవడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం కక్ష కట్టింది. శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించినా ప్రజలు వైఎస్ఆర్ సీపీతోనే ఉన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకుండా చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని శత్రువుగా చూశారు. ప్రభుత్వమే కక్ష కట్టినా ప్రజలు తమ వెంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంట ఉన్నారు' అని శోభానాగిరెడ్డి తెలిపారు. 
Share this article :

0 comments: