దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌

దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

మరోసారి దాడి చేస్తే ఊరుకోం: నల్లా సూర్యప్రకాశ్‌
హైదరాబాద్/గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అసహనం, అభద్రతకు గురౌతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్‌ విమర్శించారు. తమ పార్టీ నాయకులతో ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు విన్నవించిన దళితుడిపై టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పయ్యావుల దాడి తగదన్నారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు.  

ఓటమి భయంతో బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బీజేపీ వద్దన్నా వినకుండా కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు రూరల్ ఉప్పరపాలెం, కొత్తపాలెం, పెదఇటికంపాడులలో రావి వెంకటరమణతో బాలశౌరి కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Share this article :

0 comments: