అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ

అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

పల్లెల్లోకే పాలన
* కార్డుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు.
రేషన్‌కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు,  పక్కా ఇంటి కార్డు ఇలా....
అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో,  ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ.
ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాఫీసు.
ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకే తెస్తాం.

 
 -    ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచాలన్నది మా లక్ష్యం. దీని కోసం ప్రతి గ్రామంలోనూ కార్యాలయం ఏర్పాటు చేసి ఐరిస్ కార్యక్రమం ద్వారా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, సామాజిక పింఛన్ కార్డులు, పక్కా ఇంటి కార్డులు, ఆధార కార్డు సహా ఏ కార్డు అయినా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ప్రజలకు అందించే విధానాన్ని అమలు చేస్తాం. ఈ కార్యాలయాల్లో కంప్యూటర్, ఇంటర్‌నెట్, ప్రింటర్, ఐరిస్ మిషన్, లామినేటింగ్ మిషన్ సదుపాయం ఉంటుంది.
 -    సిటిజన్స్ చార్టర్: నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల పనులు పూర్తయ్యేలా చూస్తాం.
 -    ఫైళ్ళ సమీక్ష: ఎమ్మార్వో కార్యాలయం మొదలు సచివాలయం వరకూ అన్ని ఫైళ్ళకూ బార్ కోడ్ ఇచ్చి ఫైళ్ళ సమీక్ష నిర్వహిస్తాం. ప్రజలు తమ ఫైళ్ళు ఏ కార్యాలయంలో, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవటానికి ఇది తోడ్పడుతుంది.
 -    మహిళా అదాలత్‌లు/ న్యాయ వ్యవస్థ: మహిళా కేసులను త్వరితగతిన విచారించి, న్యాయం చేకూర్చటానికి రాష్ట్రంలోని అన్ని కోర్టులూ సాయంత్రం పూట కూడా పనిచేస్తాయి.
 -    రాష్ట్ర స్థాయి లోకాయుక్త (లోక్‌పాల్)ని పటిష్ఠం చేస్తాం.
 -    అన్ని పంచాయతీల్లోనూ జన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
 -    అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనం చేకూరుస్తాం.
 -    అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ నిర్ణీత వ్యవధిలో సమీక్షించి, ప్రజాభిప్రాయం ప్రకారం మరింత పటిష్ఠపరుస్తాం.
 -    పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ అన్ని చట్టాలనూ పునఃపరిశీలిస్తుంది. కమిటీ సూచనల మేరకు కాలదోషం పట్టిన చట్టాలన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఆచరణయోగ్యమైన చట్టాలను తీసుకువస్తాం.
 -    {పజలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసి, నూరు శాతం ఈ-గవర్నెన్స్‌ను సాధిస్తాం.
 -    భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తాం. భూమి లావాదేవీలను బెంగళూరులో మాదిరిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తాం.
 -    కాలం చెల్లిన బ్రిటిష్ పోలీస్ చట్టం స్థానంలో కొత్త పోలీస్ చట్టాన్ని తెచ్చి  ప్రజలకు సత్వరంగా, చిత్తశుద్ధితో పోలీసులు సేవలందించేలా చేస్తాం.
 -    ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం: నీటి కాలుష్యంతో వచ్చే రోగాలను అరికట్టటానికి ప్రతి గ్రామంలోనూ ఆర్వో, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. మినరల్ వాటర్‌ను నామ మాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తాం. ఈ ప్లాంట్ల నిర్వహణలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఇస్తాం.
 -    నిర్ణీత వ్యవధులలో పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, నూరు శాతం టీకాలు వేయించుకునేలా చేస్తాం. ‘హయ్యర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్’ సాధించటానికి నూరు శాతం ‘డీ వార్మింగ్’ చేస్తాం. పిల్లలకు ఉచితంగా కళ్ళద్దాలు అందిస్తాం.
 -    గుజరాత్, తమిళనాడులలో మాదిరిగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు రూపాయికి ఓ ప్యాడ్ చొప్పున శానిటరీ నేప్కిన్‌లను సరఫరా చేస్తాం.
 -    ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను నిర్మించటం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం.
 -    ఆధార్ కార్డు సహాయంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యం  కల్పిస్తాం. వలస కూలీలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. రేషన్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది.
 -    రేషన్ దుకాణాల్లో విటమిన్ ఏ, డీ, ఐరన్, క్యాల్షియం బిళ్ళలను విక్రయించడం ద్వారా ఆహార పరిపుష్టత కల్పిస్తాం.
 -    మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంత గ్రామాలలో ఉచిత సౌరశక్తి లాంతర్లు, పొగరాని పొయ్యిలు ఏర్పాటు చేస్తాం.
Share this article :

0 comments: