29 కేంద్రాల్లో 13న రీపోలింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 29 కేంద్రాల్లో 13న రీపోలింగ్

29 కేంద్రాల్లో 13న రీపోలింగ్

Written By news on Sunday, May 11, 2014 | 5/11/2014

29  కేంద్రాల్లో  13న  రీపోలింగ్
17 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో నిర్వహణకు ఈసీ నిర్ణయం
 
 వీటిలో జమ్మలమడుగు నియోజకవర్గంలో 3 కేంద్రాలు..
పాడేరు, పెనమలూరు నియోజకవర్గాల్లో 2 కేంద్రాలు..
ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిన 24 కేంద్రాలు..
సీఈవో భన్వర్‌లాల్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం

 
  హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి కింద వచ్చే 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో 12, సీమాంధ్ర జిల్లాల్లో 17 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తారు. సీమాంధ్ర జిల్లాల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్ అవసరం ఉందని మొదట సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేసింది. విశాఖపట్టణం జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కొయ్యూరు మండలం పలకజీడి 68వ పోలింగ్ కేంద్రంలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు తగులపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. మరో పక్క ఈవీఎం సమస్య ఎదురైన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని మరో పోలింగ్ కేంద్రంలో కూడా రీ పోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. అయితే ఈవీఎంలు పని చేయని కేంద్రాలను, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న జమ్మలమడుగు నియోజకవర్గాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ మొత్తం 29 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించింది.

 అక్కడ మళ్లీ అవసరం లేదన్న కలెక్టర్లు..

 రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ సందర్భంగా మొత్తం మీద 161 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోయాయని జిల్లా కలెక్టర్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మొదట్లో నివేదిక పంపించారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లడంపైన సవివరమైన నివేదికలు పంపాలని కలెక్టర్లను కోరింది. ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిన ఈవీఎంలను పక్కన పెట్టి కొత్త ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించామని, ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిన ఈవీఎంలో వేసిన  ఓట్లను కూడా లెక్కించడానికి వీలవుతుందని కలెక్టర్లు స్పష్టం చేశారు. అయినా సరే కమిషన్ సవివరమైన నివేదికను పంపాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు రికార్డులను పరిశీలించి తుది నివేదికలను శనివారం సీఈఓ కార్యాలయానికి పంపించారు. కృష్ణా, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో కలిపి మొత్తం 24 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మాత్రమే ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లాయని, అయినా పోలింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగలేదని, ఈ స్థానాల్లో రీ పోలింగ్ అవసరం లేదని జిల్లా కలెక్టర్లు నివేదించారు. ఈ నివేదికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించింది. వీటన్నింటినీ పరిశీలించిన కమిషన్.. మొత్తం 29 చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని సూచించింది.

 రీపోలింగ్ కేంద్రాలివీ...

 
 లోక్‌సభ స్థానం        అసెంబ్లీ స్థానం        పోలింగ్ స్టేషన్          ఏసీ/పీసీ
 నిజామాబాద్            బోధన్                 64                       పీసీ
 జహీరాబాద్             జుక్కల్               134                      పీసీ
 జహీరాబాద్           బాన్సువాడ            146                      ఏసీ
 జహీరాబాద్           బాన్సువాడ           39, 187                  పీసీ
 నిజామాబాద్       నిజామాబాద్ రూరల్   48, 168                  ఏసీ
 నిజామాబాద్       నిజామాబాద్ రూరల్      9                        పీసీ
 మల్కాజిగిరి            కూకట్‌పల్లి            171/ఎ                    ఏసీ
 ఖమ్మం                కొత్తగూడెం               161                     ఏసీ
 మహబూబాబాద్    భద్రాచలం               239                       ఏసీ
 శ్రీకాకుళం            శ్రీకాకుళం                 46                         పీసీ
 అరకు                కురుపాం                 192                        ఏసీ
 అరకు               సాలూరు                  134                        ఏసీ
 అరకు                పాడేరు                   68                      ఏసీ, పీసీ
 మచిలీపట్నం      గుడివాడ                  123                          పీసీ
 మచిలీపట్నం      అవనిగడ్డ                  29                           పీసీ
 మచిలీపట్నం     అవనిగడ్డ                    91                           ఏసీ
 మచిలీపట్నం      పెనమలూరు              59, 172                     ఏసీ
 విజయవాడ      విజయవాడ తూర్పు      212                           పీసీ
 విజయవాడ          మైలవరం               123                           పీసీ
 విజయవాడ        నందిగామ                171, 174                     ఏసీ
 విజయవాడ         జగ్గయ్యపేట              122                           పీసీ
 కరీంనగర్           హుస్నాబాద్              170                            పీసీ
 కడప               జమ్మలమడుగు           80, 81, 82                 ఏసీ, పీసీ
Share this article :

0 comments: