50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది!

50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది!

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది!
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ బరితెగించేసింది. ప్రచారంలోనే చేతులెత్తేసిన తెలుగుదేశం ఆఖరి క్షణాల్లో డబ్బును, మద్యాన్నే నమ్ముకుని సోమ, మంగళ వారాల్లో చెలరేగిపోయింది. విజయవాడ సిద్ధార్థ అకాడమీ కేంద్రంగా కోట్ల రూపాయల డంప్ బయటపడింది. పోలింగ్ సిబ్బంది తమ సామగ్రి, పరికరాల్ని ఉంచటానికి వినియోగిస్తున్న ప్రాంతాన్ని టీడీపీ డబ్బుల పంపిణీకి ఎంచుకోవటంతో వారం రోజులుగా ఇక్కడి నుంచి నాలుగు జిల్లాలకు డబ్బు పంపిణీ యథేచ్చగా సాగిపోయింది. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం కూడా కోట్ల రూపాయలు తరలిపోవటంతో చివరకు పోలీసులు దాడి చేయటంతో తెలుగుదేశం గూడుపుఠానీ బయటపడింది. అప్పటికే దాదాపు 50 కోట్ల వరకూ తరలించేసినా... ఇంకా రూ.50 కోట్ల వరకూ అక్కడ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే సాయంత్రమే వ్యవహారం బయటకు పొక్కినా విలేకరులను గానీ, ఫోటోగ్రాఫర్లను గానీ పోలీసులు లోపలకు రానివ్వలేదు.
 
 దాదాపు కోట మాదిరిగా ఉండే అకాడమీలోకి అనుమతి లేనివారెవరూ వెళ్లే అవకాశం కూడా లేదు. దీంతో మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో టీడీపీ ఈ సొమ్మును భద్రపరిచింది. మంగళవారం సాయంత్రం నుంచి మీడియా ప్రతినిధుల్ని ఆ అంతస్తులోనికి వెళ్లనీయకుండా అకాడమీ సెక్యూరిటీ అడ్డుకున్నారు. తొలుత రూ.2.5 కోట్లు దొరికిందని తనిఖీ చేస్తున్న సిబ్బంది చెప్పగా, ఆ తరువాత రూ.4 కోట్లకు పెంచారు. అర్ధరాత్రి దాటిన తరువాత ‘‘రూ.6 కోట్ల వరకు లెక్కించాం. ఇంకా చాలా కట్టలున్నాయి. బుధవారం చూస్తాం’’ అంటూ చెప్పి వెళ్లిపోవడం విశేషం. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ సొమ్ము అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో లాకర్ ఉందని, రూ.50 కోట్ల వరకూ ఉన్న ఈ మొత్తాన్ని తీయటానికి అకాడమీ యాజమాన్యం అంగీకరిచడం లేదని తెలిసింది. మరోవంక తమ పార్టీకి చెందిన అంతమొత్తం ఒకేసారి దొరికిపోవటంతో దాన్ని విడిపించుకునేందుకు టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు అధికారులతో బేరసారాలు సాగిస్తున్నారు.
 
 ఇక్కడి నుంచే జిల్లాలకు: పోలింగ్ పరికరాలు, సామగ్రి ఉంచటానికి, సరఫరా చేయటానికి ఎన్నికల సిబ్బంది ఈ అకాడమీని వినియోగిస్తున్నారు. దాన్ని అదనుగా తీసుకుని కొన్ని రోజులుగా టీడీపీ ఇక్కడ వందల కోట్ల రూపాయలను దాచి తరలించినట్లు మంగళవారం నాటి సంఘటనతో బయటపడింది. ఇప్పటికే సుమారు రూ.50 కోట్లకు పైగా మొత్తాన్ని చుట్టుపక్కలున్న ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలించారని కూడా తెలిసింది. దీన్నంతటినీ సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో కలిసి టీడీపీ కృష్ణా జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి పర్యవేక్షించారని, మంగళవారం ఉదయం నుంచి ఆయన కూడా పత్తాలేరని సమాచారం. నిజానికి మూడు రోజులుగా ఎక్కడ పర్యట చేస్తున్నా చంద్రబాబు రోజూ విజయవాడ వచ్చి పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని చంద్రబాబు విజయవాడ వచ్చి సుజనా చౌదరి ఎక్కువగా ఉండే హోటల్‌లోనే బస చేశారు. ఆదివారం ఉదయం పార్టీ నేతలతో కొద్దిసేపు ఆర్థిక లావాదేవీలు మాట్లాడాకా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఎన్నికల ప్రచారానికి ఆఖరు రోజు కావడంతో ఆ రోజు కృష్ణాజిల్లా అవనిగడ్డ పర్యటనకు వచ్చి విజయవాడకు వచ్చి ఇక్కడ నాయకులతో మంతనాలు జరిపి ఇక్కడ నుంచే డబ్బు పంపిణీకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
 
 అంబులెన్స్ ద్వారా తరలింపు: విశ్వసనీయ సమాచారం మేరకు... అకాడమీలో భద్రపరిచిన సొమ్మును తొలుత టీడీపీ ముఠా తమకు అనుకూలంగా ఉన్న హాస్పటల్స్‌కు తరలించింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఒక రోగికి సెలైన్ ఇచ్చి పడుకోబెట్టి బెడ్ కింద డబ్బు పెట్టి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ తరలించారు. ఆసుపత్రి నుంచి రోగిని పంపుతున్నట్లుగా రిపోర్టులుండటంతో అధికారులు కూడా తనిఖీ చేయలేదు. దీంతో పచ్చనోట్లు యదేచ్ఛగాా నాలుగు జిల్లాలకు తరలిపోయాయి. కాగా మంగళవారం విషయం తెలిశాక అకాడెమీ వద్ద మీడియా ప్రతినిధులు నిఘా పెట్టారు. వారి దృష్టి మరల్చేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశమంటూ  అన్ని చానల్స్, పేపర్ల ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికలు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండగా విలేకర్ల సమావేశం పెట్టడం చర్చనీయమైంది. సాక్షి చాన్సల్‌లో వచ్చే వార్తలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ చెప్పేందుకే విలేకర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పడం విశేషం.
 
 సుజనా చౌదరిని అరెస్టు చేయండి
 ఆ అకాడమీపై తక్షణం చర్య తీసుకోండి: వైఎస్సార్ కాంగ్రెస్
 
 విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఎన్నికల అధికారులకు పట్టుబడిన డబ్బుకు సంబంధించి టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. సుజనా చౌదరి మనీ లాండరింగ్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు తరలించారని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని తమ ఫిర్యాదులో పార్టీ పేర్కొంది. సొమ్మును దాచిన అకాడమీ దీనికి బాధ్యత వహించాలని, అకాడమీపై కూడా చర్య తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Share this article :

0 comments: