కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ

కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ

Written By news on Wednesday, May 21, 2014 | 5/21/2014

కీలక ఘట్టానికి వేదిక...ఇడుపులపాయ
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ ఘట్టానికి ఇడుపులపాయ మరోమారు వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వీరంతా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకోనున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ సమీపంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధుల భేటీ జరుగుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని 66మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలతో పాటు తెలంగాణకు చెందిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకు ముందు వైఎస్ ఘాట్ వద్ద మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు.

సార్వత్రిక ఎన్నికల్లో 67మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లోనూ, ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పోలింగ్ కంటే ముందే రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

కాగా వైఎస్ఆర్ సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినా గెలుపొందిన ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు ఇడుపులపాయలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.శాసనసభా పక్ష నేత ఎన్నికతోపాటు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు కూడా వీలుంటుందని వారు భావించటంతో ఇడుపులపాయకు ఈ కార్యక్రమాన్ని మార్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ శాసనసభా పక్షనేత ఎన్నికతో పాటు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహం, రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం.
Share this article :

0 comments: