మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం?

మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం?

Written By news on Thursday, May 1, 2014 | 5/01/2014

జనమంతా ఏకం కావాలి.. మనసు తెలుసుకునే నాయకుడినే ఎన్నుకోవాలి
* కృష్ణా జిల్లా ప్రచారంలో వైఎస్ జగన్
* అధికారం కోసం చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు
* తొమ్మిదేళ్లు సీఎంగా ఉండీ ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని ఆయనను నిలదీయండి
* ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆయన పార్టీ ఉండదు.. అందుకే గడ్డి తినడానికీ వెనుకాడట్లేదు
* ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ.. మరొకవైపు    కుళ్లు, కుతంత్రాలు ఉన్నాయి.. వాటి మధ్య పోటీ
* ఇప్పుడు మీరంతా ఏకం కావాలి... వైఎస్ కలలుకన్న సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం
* చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు వైఎస్సాఆర్ జనభేరి సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
 
వైఎస్సార్ జనభేరి సభ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవి మన తలరాతను మార్చబోయే ఎన్నికలు. అందువల్ల ఓటు వేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎటువంటి నాయకుడు మనకు కావాలి? ఎటువంటి ముఖ్యమంత్రి కావాలి? అనేది మనం ప్రశ్నించుకోవా లి. ఏ ముఖ్యమంత్రి అయితే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో, వాళ్ల మనస్సు తెలుసుకుంటాడో.. ఏ నాయకుడైతే చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేందుకు ఆరాటపడతాడో.. అటువంటి వ్యక్తిని మనం మన నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మన సీఎంగా ఎన్నుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వేసే ఓటుతో మన తలరాతను మార్చుకోబోతున్నాం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం... ఆయన తరువాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం... కానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రం ఇప్పటికీ ప్రతి పేదవారి గుండెల్లో ఉండిపోయారు. రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవాడికి కూడా మంచి చేసిన మహానుభావుడు వైఎస్సార్. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు.

వైఎస్సార్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి’’ అని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ బుధవారం కృష్ణా జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. ముందుగా ఉదయం చల్లపల్లిలో రోడ్‌షో నిర్వహించి అనంతరం అక్కడ జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో మాట్లాడారు. సాయంత్రం ఏడున్నర గంటలకు పామర్రులో, రాత్రి ఉయ్యూరులో జరిగిన సభల్లోనూ మాట్లాడారు. జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

చంద్రబాబును నిలదీయండి...
చంద్రబాబూ..! తొమ్మిదేళ్లు సీఎంగా పరిపాలన చేశావు... ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఒక్కటంటే ఒక్కటి ఎందుకు చేయలేకపోయావు? అని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు? అని ప్రశ్నించండి.

ఎప్పుడైనా కాలేజీలకు వె ళ్లావా? వారెలా చదువుతున్నారో తెలుసుకున్నావా? అని అడగండి. తొమ్మిదేళ్లు సీఎంగా వుం టూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ. 30 వేలు ఖర్చవుతుంది. ఆ రూ. 30 వేలు కట్టాలంటే పొలమో ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ? అంటూ ప్రశ్నించండి.

చంద్రబాబునాయుడు హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా ఆ పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వుండేది. డాక్టర్ దగ్గరకు వెళితే రూ. 2 లక్షలో... రూ. 3 లక్షలో అవుతుందని డాక్టర్ చెప్పినప్పుడు రెండు రూపాయలో.. మూడు రూపాయలో.. నాలుగు రూపాయలో వడ్డీలకు తెచ్చినప్పుడు నీవు ఏమి చేశావు చంద్రబాబూ? అని నిలదీయండి.

ఎన్నికలకు వెళ్లేముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు... ఎన్నికలు అయిపోయాక ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా చంద్రబాబునాయుడూ? అని ప్రశ్నించండి. ఏ రోజైనా ఆయన గ్రామాల్లోకి వెళ్లాడా అని అడగండి.
 
ఎన్నికలకు వెళ్లేముందు మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పా వు.. ఎన్నికలు అయిపోయాక చెల్లెమ్మలతో తనకేం పని ఉందని చెప్పి.. మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. ఆ రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని చంద్రబాబును నిలదీయండి.

ఒకవైపు సోనియాగాంధీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తుంటే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి సోనియాను నిలదీయాల్సింది పోయి.. ఒకవైపు అన్యాయం జరుగుతుందని చెప్తూ మరోవైపు ఆయన తన ఎంపీల చేత పార్లమెంటులో సోనియాకు అనుకూలంగా విభజనకు అనుకూలంగా ఎందుకు చంద్రబాబు ఓటేయించాడని నిలదీయండి.

విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను...
చంద్రబాబునాయుడు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయత లేని మాటలు మాట్లాడుతున్నాడు. నిజాయితీ లేని తన మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ఒక రోజు సెల్‌ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. రెండో రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. మూడో రోజు సాధ్యంకాని రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణాలు మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటినుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్నీ ఫ్రీగా ఇస్తానని చంద్రబాబునాయుడు చెప్తున్నాడు.

చంద్రబాబునాయుడు సాధ్యంకానివి, చేయలేనివి చెప్తూ అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో కొందరు నా వద్దకు వచ్చి.. ‘అన్నా... చంద్రబాబు అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నాడు.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అంటున్నాడు.. మనం కూడా ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు చెప్దాం...’ అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ ఒక్కటైతే నేను చెప్తా... చంద్రబాబులా నేను అబద్ధాలు ఆడలేను. ఆయనలా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. నేను ఒక మాట చెప్తే ఆ మాట కోసం నిలబడతాను.

నాకు వైఎస్ నుంచి వచ్చిన వారసత్వం విశ్వసనీయత...
చంద్రబాబు ఎందుకు విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నాడంటే.. ఆయనకు 65 ఏళ్లు. ఈ ఎన్నికలు అయిపోయాక ఆయనుండడు.. ఆయన పార్టీ ఉండదు.. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అధికారం కోసం ఏ గడ్డైనా తినడానికి వెనకాడటం లేదు. ఆయనలా నేను విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబునాయుడు కంటే పాతిక సంవత్సరాల చిన్నోడిని. మరో ముప్పై సంవత్సరాలు రాజకీయాలు చేయాలి. విశ్వసనీయత అన్న పదం మీద రాజకీయాలు చేయాలి కాబట్టి అబద్ధాలు చెప్పలేను. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందంటే అది విశ్వసనీయత. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులు చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. ఆ దేవుడు అనుగ్రహిస్తాడు.. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేస్తాను.’’

దిగజారిపోయిన వ్యవస్థ..
దివంగత నేత ఎప్పుడూ అంటూ ఉండేవాడు. రాజకీయం అన్నది ప్రతీ పేదవాడి గుండె చప్పుడు వినడం అని ఆయన అనేవారు. రాజకీయం అన్నది చనిపోయిన తర్వాత కూడా ప్రతీ పేదవాడి గుండెల్లో బతికే ఉండటం కోసం ఆరాటపడడమే రాజకీయమని ఆయన అంటూ ఉండేవారు. కానీ ఈరోజు రాజకీయం అన్నది ఒక చదరంగంలా తయారుచేశారు. ఓట్ల కోసం సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడడంలేదు. ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనకాడడంలేదు. ఓట్ల కోసం సీట్ల కోసం ఒక మనిషిని ఎలా తప్పించాలి అని ఆలోచన చేస్తున్నారు. ఒక మనిషి లేకుండా ఒక పార్టీ లేకుండా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నారు. అన్యాయంగా కేసులు పెట్టి ఒక మనిషిని జైలు పాలు చేయడానికైనా వెనుకాడడంలేదు. బంగారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభ జించడానికి వెనుకాడడంలేదు. దిగజారిపోయిన వ్యవస్థ కనిపిస్తోంది. ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. వైఎస్ పరిపాలనకు ముందు.. ఇప్పుడు జరుగుతున్న పాలనను ఒకసారి బేరీజు వేసుకోవాలి.

రైతులతో బాబు ఆడుకుంటున్నాడు..
చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు. మరి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి రుణాల మాఫీ దేవుడెరుగు.. వడ్డీల మాఫీ అయినా చేయలేదేం? అది సాధ్యంకాదు కాబట్టి చేయలేదు. రైతు రుణాలు మాఫీ అంటాడు.. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు మా ఫీ అంటాడు. మన బడ్జెట్‌లో మనకొచ్చే ఆదాయాలు కేవలం రూ. 1.25 లక్షల కోట్లుంటే చంద్రబాబు 1.5 లక్షల కోట్ల రుణా లు మాఫీ చేస్తానంటున్నాడు. ఇలా పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు. ఇటువంటి దొంగ వాగ్దానం చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత రైతన్నలు బ్యాంకుల వద్దకు రుణాల కోసం వెళ్తారు. మీరు కట్టాల్సి రుణాలు ఇంకా ప్రభుత్వం కట్టలేదు కాబట్టి మీకు కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకుల వారు చెప్తారు. అప్పుడు ఆ రైతన్న పరిస్థితి ఎంత అన్యాయంగా ఉంటుందో ఆలోచించాలి.
 
ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా..?
చంద్రబాబు ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి 65 ప్రభుత్వ సంస్థలను మూసివేయించి 26 వేల మందిని నడిరోడ్డు మీదకు నెట్టాడు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉంటాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. స్వాతంత్య్రం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆయనకు తెలుసా? రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటిది మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పట్టపగలు అబద్ధాలు ఆడుతున్నాడు.’’
 
వైఎస్ కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం
చంద్రబాబు పాలనను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. అలాగే దివంగత నేత వైఎస్ సువర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. కృష్ణా జిల్లాలో వ్యవసాయం అన్నది కీలకమైంది. చంద్రబాబు హయాంలో మన కళ్ల ఎదుటే ఆల్మట్టి నిర్మాణం మొదలుపెట్టింది. మన కళ్ల ఎదుటే కృష్ణా ప్రాంతానికి సంబంధించి ఒక పంట వేయడానికి కూడా రైతన్నలు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది.

దివంగత నేత వైఎస్ సువర్ణయుగంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వ్యక్తి. చంద్రబాబునాయుడిలా అబద్ధాలు చెప్తూ నిజాయితీ లేని విధంగా వ్యవహరించలేను. మాట కోసం ఎందాకైనా పోయే విశ్వసనీయత పాలన కావాలా లేదా ఆలోచన చేయండి. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపు కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ పరిస్థితిలో మీరంతా ఒకటి కావాలి. దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందాం
Share this article :

0 comments: