ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం

Written By news on Thursday, May 1, 2014 | 5/01/2014

ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ ప్రచారం
కర్నూలు :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి దివంగత శోభానాగిరెడ్డి తరపును ఆమె పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియ గురువారం ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల్లో శోభా నాగిరెడ్డికి ఓటు వేసి, అమ్మ ఆశయాలను నెరవేర్చండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 'అమ్మను పోగొట్టుకొని అందరం పుట్టెడు దుఖంతో ఉన్నాం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి నిజమైన నివాళి అర్పిద్దాం' అని అఖిల ప్రియ అన్నారు.

అందరిని ఆప్యాయంగా పలకరించే అమ్మ భౌతికంగా దూరమైనా మన హృదయాల్లో మాత్రం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జగనన్న సీఎం అవుతారని, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై అమ్మ కన్న కలలను నిజం చేస్తారని ఆమె అన్నారు.
Share this article :

0 comments: