బాబు వంచనకు సాక్ష్యం ఇదిగో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వంచనకు సాక్ష్యం ఇదిగో..

బాబు వంచనకు సాక్ష్యం ఇదిగో..

Written By news on Saturday, May 3, 2014 | 5/03/2014

2000లో భువనేశ్వరి డెరైక్టర్‌గా బాబు ఐటీ కంపెనీ
* దాని చిరునామా హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ ఆఫీసే
* ఈ కంపెనీ నలుగురు డెరైక్టర్లలో ఒకరు ఎన్నారై.. ఆ ఎన్నారై పేరు రాయపాటి వెంకటపతి నాయుడు
* 2003లో పోర్టల్ ప్లేయర్ కంపెనీ పేరిట హైదరాబాద్‌లోకి.. దానికి అర్జెంటుగా గచ్చిబౌలిలో ఐదెకరాలిచ్చిన చంద్రబాబు
* దాని ఎండీగా జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి అలియాస్ జేఏ చౌదరి
* 4 ఏళ్లు తిరక్కుండా తమ సంస్థను ఎన్‌విడియాకు అమ్మేసిన పోర్టల్ ప్లేయర్
* ఇదీ... బాబు మార్కు ఐటీ అభివృద్ధి; బినామీలకే కేటాయింపులు
* ఇపుడు ఐడీఎఫ్ పేరిట టీడీపీకి ప్రచారం చేస్తున్న జేఏ చౌదరి    
 
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి):  ‘పారిశ్రామిక అభివృద్ధి ఫోరం (ఐడీఎఫ్)’ అంటూ ఈ మధ్య చంద్రబాబు ఇంటి నుంచి ఓ బస్సు బయల్దేరింది. ప్రతిచోటా పారిశ్రామిక వేత్తల ముసుగులో ‘‘జై చంద్రబాబు’’ అంటూ ప్రచారం చేసిన ఆ బృందానికి నాయకత్వం వహించింది ఎవరో తెలుసా? జేఏ చౌదరి అలియాస్ జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి. అసలు ఈయనెవరో తెలుసా?

గతంలో ఈ జేఏ చౌదరి పోర్టల్ ప్లేయర్ అనే సంస్థకు మేనేజింగ్ డెరైక్టర్. ఈ సంస్థకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2003లో గచ్చిబౌలిలో అత్యంత విలువైన ఐదెకరాలను కేటాయించారు. ఇది అమెరికాకు చెందిన సంస్థగా పేర్కొన్నారు.
 ఇంకా ఘోరమేంటంటే అమెరికా సంస్థ పోర్టల్ ప్లేయర్ తరఫున ఇండియాలో డెరైక్టర్‌గా వ్యవహరించింది, ప్రభుత్వంతో డీల్ చేసింది వేరెవరో కాదు. ఎన్నారై రాయపాటి వెంకటపతినాయుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

ఈ రాయపాటి వెంకటపతి చంద్రబాబుకు ఎంత సన్నిహితుడంటే... 2000వ సంవత్సరంలో వెంక టపతి నాయుడితో కలిసి చంద్రబాబు భార్య భువనేశ్వరి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. ‘ఎ టు జెడ్ ఈ-మల్టీసాఫ్ట్ లిమిటెడ్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో భువనేశ్వరి, వెంకటపతి సహా కార్వీ అధిపతి మేకా యుగంధర్, బాబు బినామీ వడ్లమూడి నాగరాజా నాయుడు డెరైక్టర్లు. నాగరాజానాయుడి భార్య సుధాశారద, కుమార్తె లలిత వాటాదారులు. కంపెనీ అడ్రస్ కూడా వేరెక్కడో కాదు. ప్రస్తుతం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ఎక్కడైతే ఉందో... అదే! అంటే 6-3-541/సి, పంజాగుట్ట, హైదరాబాద్!!.

ఇది చాలు ఈ ‘ఏ2జెడ్ ఈ మల్టీసాఫ్ట్’ కంపెనీ చంద్రబాబుదేనని చెప్పడానికి. మరి ఈ కంపెనీలో డెరైక్టర్‌గా చేర్చుకున్న రాయపాటి వెంకటపతి కంపెనీకి... గచ్చిబౌలిలో అత్యంత విలువైన 5 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టారంటే అర్థమేంటి? ఇది బాబు మార్కు మాయాజాలమని కాదా? 2002లో ఈ ‘ఏ2జెడ్’ కంపెనీ పేరును ‘బిజ్ ప్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’గా కూడా మార్చారు. దీని అధీకృత మూలధనం అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.10 కోట్లుగా పేర్కొన్నారు. అంటే రూ.10 విలువైన కోటి షేర్లను జారీ చేయడానికి దీనికి వీలుంటుందన్న మాట. ఆర్‌ఓసీ పత్రాల్లో రాయపాటి వెంకటపతిని విదేశీయుడిగా పేర్కొన్న భువనేశ్వరి అండ్ కో... ఆయన చిరునామాను 4706, విల్‌కాక్స్ అవెన్యూ, శాంటా క్లారా, కాలిఫోర్నియా, యూఎస్‌ఏగా పేర్కొన్నారు.
 
ఎన్‌విడియా సంస్థలో విలీనమైన పోర్టల్ ప్లేయర్
2003లో ఐదెకరాల స్థలం తీసుకున్న పోర్టల్ ప్లేయర్... తన కార్యకలాపాల కోసం హైదరాబాద్‌లోనే వివిధ భవనాలను ఏడాది, రెండేళ్లకు లీజుకు తీసుకుంది. ఈ మేరకు 2003లోనే జేఏ చౌదరి, రాయపాటి వెంకటపతి పలువురితో ఒప్పందాలు చేసుకున్నారు. అంతేతప్ప శాశ్వత కట్టడాల జోలికి పోలేదు. నాలుగేళ్లపాటు ఇలా అరకొర కార్యకలాపాలు నడిపించిన పోర్టల్ ప్లేయర్.. ఈ మధ్యలోనే ఎన్‌విడియా సంస్థకు షేర్లను విక్రయించింది. చివరకు తమ కంపెనీని ఎన్‌విడియాలో విలీనం చేసేయటం... చౌదరి బయటకు వచ్చేయటం... అన్నీ జరిగిపోయాయి. ఇదీ చంద్రబాబు బినామీ బాగోతం.
 
గచ్చిబౌలిలో ఐదెకరాలంటే?
నిజానికి ఏ జిల్లాలోనో, పల్లెటూరులోనో 500 లేదా 1000 ఎకరాలు కేటాయించినా చంద్రబాబు లాంటి నేతలకు పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే అక్కడ తన అనుయాయులకు గనక భూములు కేటాయిస్తే... వారు తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టాల్సి ఉంటుంది. అందుకు భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెపైచ్చు ఆ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలనుకున్నా... దాన్ని కొనటానికి ఎవరైనా ముందుకు రావటం కష్టం. అదే హైదరాబాద్‌లాంటి సిటీలో హైటెక్ సిటీ చుట్టూనో, గచ్చిబౌలి పక్కనో అయితే వారు భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు. రుణం ద్వారానో, మరో రకంగానో భవంతి నిర్మిస్తే చాలు.

ఆ ఆస్తిని చూసి... ఆ కంపెనీని టేకోవర్ చేయడానికి ఏ సంస్థయినా ముందుకు వస్తుంది. ఈ తరహా బాబు జమానాలో టేకోవర్ అంటే మరేమీ కాదు. ఆ భవనాన్ని షేర్ల మార్గంలో కొనుక్కోవటమే. అంతే!! పెపైచ్చు జిల్లాలో ఎకరా ఏ 5-10 లక్షలో ఉంటే... ఇక్కడ దానికి 50 నుంచి వందల రెట్ల ధర ఉంటుంది. అంటే అక్కడ 500-1000 ఎకరాలిస్తే ఇక్కడ ఐదెకరాలకు సమానమన్న మాట. అందుకే బాబు స్మార్ట్ పాలన ఎంచుకున్నారు. ఐటీ మార్గంలో హైదరాబాద్ భూములన్నీ కొల్లగొట్టేశారు. బినామీలకు పంచేశారు. పైసా వసూల్!!
 
రామోజీ సర్టిఫికెట్లు.. ‘ఈనాడు’లో ఇంటర్వ్యూలు
విచిత్రమేంటంటే ఇలాంటి కుంభకోణాలపై ‘ఈనాడు’ అక్షరం ముక్క కూడా రాయదు. బాబు దోపిడీ జమానా గురించి సింగిల్ కాలమ్ వార్త కూడా ఎక్కడా ప్రచురించదు. హైటెక్ సిటీ చుట్టూ భూముల్ని బాబు ఇలా తన బినామీలకు పంచేయటం, ముందే అక్కడ హైటెక్ సిటీ వస్తోందన్న సమాచారాన్ని తన బినామీ మిత్రులు మురళీమోహన్ వంటివారికి చేరవేసి భారీగా భూములు కొనిపించడం... ఇవేవీ రామోజీరావుకు మోసాల్లా కనిపించవు.

ఎందుకంటే బాబుకు బాకా ఊదటం ఆయన విధి కాబట్టి. కానీ తాను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా... అందరికీ సుద్దులు చెబుతూ... ‘ఈనాడు ముందడుగు’ ‘యువ శంఖారావం’ అంటూ రామోజీ చెలరేగిపోవటమే ఆశ్చర్యకరం. పెపైచ్చు బాబు ద్వారా ప్రజా ధనాన్ని దోచుకున్న వారంతా ‘స్వచ్ఛంద, స్వతంత్ర’ పారిశ్రామికవేత్తలుగా, విశ్లేషకులుగా అవతారాలెత్తి జనాన్ని బాబువైపు తిప్పే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ల వెనకే నిల్చుని రామోజీ బాకా ఊదుతూ ఉంటారు. ఇదెక్కడి తీరు? ఈ రాష్ట్ర ప్రజలకు ఆలోచనా శక్తి లేదనుకుంటున్నారా వీళ్లంతా? లేక అప్పటిలానే జనానికి వార్తలు అందజేయడానికి ‘ఈనాడు’ ఒక్కటే ఉందనుకుంటున్నారా?
 
లెట్స్ ఓట్... పేరిట బాబుకు స్వచ్ఛంద సేవ
నాలుగు రోజుల కిందట ‘ఈనాడు’లో జేఏ చౌదరి ఇంటర్వ్యూ ప్రచురించారు రామోజీ. పారిశ్రామిక వేత్తలంతా చంద్రబాబు వెనకే ఉన్నారన్నది ఈ ఇంటర్వ్యూ సారాంశం. ఇంకా చిత్రమేంటంటే ఈ జేఏ చౌదరి ‘లెట్స్ ఓట్’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పెట్టారు. ‘‘అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలి...’’ అని పిలుపునిస్తూ ఆ సంస్థ ద్వారా ర్యాలీలు, కార్యక్రమాలు చేశారు. అది స్వచ్ఛంద సంస్థ రూపంలో ఉంది కనక ఈ కార్యక్రమాల్లో పదవుల్లో  ఉన్న ఎన్నికల అధికారులు సైతం పాల్గొన్నారు.

కొందరు యువత కూడా ఈ మాటలు నమ్మి దీని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఎన్నికలొచ్చేసరికి ఈయన ముసుగు తీసేశారు. ‘పచ్చ’బొట్టు సాక్షిగా... జై చంద్రబాబు అనేశారు. దీన్ని ఏమనుకోవాలి? రామోజీ కూడా ‘ఈనాడు యువ శంఖారావం’ ‘ఈనాడు ముందడుగు’ అంటూ చేస్తున్న కార్యక్రమాలన్నీ బాబు కోసం కాదా? జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ పేజీలకు పేజీలు విషం కక్కుతున్న రామోజీకి... తన ముసుగు ఏనాడో జనం తీసేశారని తెలీదా? ఇంకా ఎన్నాళ్లీ పచ్చరాతలు?
Share this article :

0 comments: