బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్

బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్
బాబు పాలన.. రైతులకు ఉచిత విద్యుత్..?
 ఏ పాలకుడూ ఊహించని పథకం ఇది. కానీ, తొమ్మిదేళ్లు సీఎంగా, రైతులను అన్ని రకాలుగా వేధించిన చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా వినిపించుకోకపోగా, చంద్రబాబు వ్యవసాయం దండగమారి వ్యవహారమని, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. కరువు కాటకాలతో కుంగి కృశిస్తున్న రైతులు విద్యుత్ బకాయిలు కట్టకపోతే వారి మోటార్లు, స్టార్టర్లను పీక్కెళ్లేవారు. అంతేకాదు రైతులను జైళ్లకు కూడా పంపారు. బకాయి వసూలు, పెనాల్టీల వసూలు కోసం ప్రత్యేక జీవోలు విడుదలయ్యాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో వారిని పిట్టల్లా కాల్చారు. రైతులు, చేనేత కార్మికులు పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అవమానించిన రాజకీయ నాయకుడు చరిత్రలో చంద్రబాబునాయుడే.
 
 -    ప్రభుత్వం చేసే ప్రతీ పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు పాలసీ, ఫిలాసఫీ. ఇందులో భాగంగానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు.
 -    విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు.    
 -    మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు.
 -    ప్రతీ ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. అటు గృహ వినియోగానికీ, ఇటు వ్యవసాయానికీ కరెంటు చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే.     
 -    చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లు తొలగించారు. పొలాల మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు.
 -    ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు.
 విద్యుత్ పోటు..
 బాబు హయాంలో విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. వ్యవసాయ రంగం మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన రూ. 50లకు హార్స్‌పవర్ విద్యుత్ చార్జీని రూ.250కి పెంచి కోలుకోలేకుండా దెబ్బ తీశారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు.
 -    విద్యుత్ సంస్కరణల వెనుక రహస్య ఎజెండా ఏదీ లేదని పదేపదే ప్రకటించుకున్నా బాబు ప్రపంచబ్యాంకు ఎజెండానే అమలు చేశారు. విద్యుత్ చార్జీలను పెంచాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జేమ్స్ ఉల్ఫెన్‌సన్ ప్రకటించారు.
 -    సామాన్యుల మీద  విద్యుత్ భారం మోపడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఏటేటా విద్యుత్ చార్జీలు వడ్డిస్తామని చంద్రబాబు అధికారంలో ఉండగానే ప్రకటించారు.
 
 రాజన్న రాజ్యం
 ఉచితంపైనే తొలి సంతకం
 -    అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు.
 -    ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి.
 -    ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
 -    2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20ని కూడా వసూలు చేయలేదు.
 -    వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు
 పెంచుతామన్నారు.
 
 జగన్ సంకల్పం
 ఉచిత విద్యుత్
 -    వ్యవసాయానికి రోజుకు 7 గంటల నిరంతర ఉచిత విద్యుత్.
 -    పగటిపూటే రైతులకు కరెంటు.
 -    2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.
 -    రైతు కుటుంబాల్లో  మళ్లీ కాంతులు పండిస్తాను.
 
150 యూనిట్ల కరెంటు రూ. 100 కే...
* తప్పుడు బిల్లులు, ఛార్జీల భారంతో ఇన్నాళ్లూ ఇక్కట్లు
*  పెద్ద బిల్లులు కట్టకపోతే కనెక్షన్లే కట్ చేశారు.
*  ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ
*  నిరుపేద కుటుంబాలు కరెంటు కోసం
* పక్కమార్గాలు వెతుక్కుంటున్నారు. ఇకపై ఈ చీకట్లు ఉండవు...
* 150 యూనిట్ల వరకు నెలకు రూ.100కే కరెంటు ఇస్తాం.
* 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో
* విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితి లేకుండా చేస్తా.
 
 మరింత కరెంటు
 -    అన్ని గృహ, వాణిజ్య సముదాయాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. సోలార్, విండ్ విద్యుత్తు పార్కులను ప్రోత్సహిస్తాం.
 -    సౌరశక్తిని, పవనశక్తిని పూర్తిగా వినియోగించుకోవటంపై, చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం.
 -    అంతే కాకుండా 800 మెగా వాట్ల కృష్ణపట్నం థర్మల్ కేంద్రం రెండో దశ, 800 మెగా వాట్ల వీటీపీఎస్ 5 వ దశ, 960 మెగావాట్ల పోలవరం జలవిద్యుత్ కేంద్రం, 1600 మెగావాట్ల వాడరేవు మెగా విద్యుత్ కేంద్రం మొదటి దశల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.
Share this article :

0 comments: