చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు

చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు

Written By news on Saturday, May 3, 2014 | 5/03/2014

చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు
చంద్రగిరి : 'ప్రజలు నీ కష్టాన్ని, నీ నిజాయితీని, అభివృద్ధి చేయాలన్న నీలోని కసిని గుర్తించారు. నీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు... విజయోస్తు మిత్రమా...' అంటూ ప్రముఖ సినీనటుడు డాక్టర్ మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆశీర్వదించారు. రంగంపేట ప్రాంతంలోని శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఉన్న మోహన్ బాబును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 'పార్టీకోసం, నమ్ముకున్నవారి కోసం నీలాగా కష్టపడిన నిజమైన రాజకీయ నాయకుడిని మరొకరిని చూడలేదు. నీ కష్టాన్ని గుర్తించిన ప్రజలు పార్టీలకు అతీతంగా నీవెంటే ఉన్నారు. నీకు ప్రజాబలంతో పాటు దైవబలం కూడా మెండుగా ఉంది. విజయోస్తు అన్న నా మాటలను పైనున్న తధాస్తు దేవతలు విని తథాస్తు అంటూ దీవించేశారు. విజయం నీదే' అన్నారు.
Share this article :

0 comments: