నాయకుడి నాలుగేళ్ల పోరాటానికి మన సాయం నేడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకుడి నాలుగేళ్ల పోరాటానికి మన సాయం నేడు!

నాయకుడి నాలుగేళ్ల పోరాటానికి మన సాయం నేడు!

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

సత్యమేవ జయతే! సోనియా గాంధి నియంతృత్వానికి ఎల్లలు లేవు, చంద్రబాబు అధికార యావకి పొత్తులు చాలవు, యెల్లో మీడియా దుష్ప్రచారానికి హద్దులు లేవు, పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్క లేదు, అంబాని సోదరుల కేజీ బేసిన్ మీదున్న ఆశకి అంతే లేదు! వీరందరికి ఎదురు నిలిచి పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయమే లేదు! తెలుగుజాతి గర్వపడే పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద దేశ విదేశాల్లోని పచ్చ జాతి చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డు అదుపు లేదు. అబద్ధాలని నిజాలుగా అలవోకగా చలామణీ చేస్తారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. జగన్ కాంగ్రేసుని వీడి బయటకపోయి పార్టీ పెట్టగానే, సోనియా గాంధీ ప్రభుత్వ విచారణా సంస్థలని వాడుకుని అన్యాయంగా కేసులు పెట్టి జైలుకి పంపి, విచ్చలవిడిగా మల్టిపుల్ చార్జుషీట్లు వేసి 90 రోజుల్లో ఇవ్వాల్సిన బెయిల్ 16 నెలలుగా ఇవ్వకపోవడం రాజకీయ కుమ్మక్కుతోనేనని, ప్రజాక్షేత్రంలో ఆ దృఢమైన నాయకుడిని ఎదుర్కోలేక పోవడమేనని రాష్ట్ర ప్రజలందరికీ ఎరుకైన విషయమే అయినా ఈ పచ్చజాతి మేధావులకి మాత్రం పట్టదు, రాజ్యాంగానికి జరుగతున్న అపచారాన్ని ప్రశ్నించరు ఎందుకంటే వాళ్లకి కావాల్సింది వారి వర్గానికి అధికారం రావడమే ఎన్ని వ్యవస్థలు నాశనమయినా! వారు పట్టిన కుందేలుకి రెండే కాళ్ళు! వాళ్ళ కుమ్మక్కు నాయకుడు చంద్రబాబులా కాకుండా జగన్ కాంగ్రెసుని, సోనియా గాంధిని ఎదుర్కుని పోరాటం చెయ్యడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారత దేశం లోనే కానరాదన్న సంగతి ఈ మేధావులకి తెలీదంటే విడ్డూరం. సిబిఐ కేసులు అనగానే తోక ముడిచి కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్న మన రాష్ట్ర, ఇతర రాష్ట్రాల నాయకులను ఎంతో మందిని ఇప్పటికీ చూస్తున్నాము. జగన్ ఒక్కడే ధైర్యంగా నా ఆస్తులు మొత్తం పోయినా, నన్ను జైల్లో పెట్టినా నేను ఇచ్చిన మాటను తప్పను, మాట తప్పని మడమ తిప్పని నాయకుడిని నేను అని సగర్వంగా ప్రకటించుకుని, ఇచ్చిన మాటకు కట్టుబడి జైలుకు కూడా ధైర్యంగా వెళ్లి జైల్లో ఎన్ని రోజులుంటాడో కూడా తనకే తెలియని పరిస్థితుల్లో తన పార్టీ నాయకులకు, తన అభిమానులకి, ప్రజలకి ధైర్యం చెపుతూ వచ్చారు. ఇలాంటి నాయకుడు మన నాయకుడు కావడం ఆంధ్ర ప్రదేశ్ అదృష్టం. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల నుంచి జగన్ ఒక్కడే బయట పడేయగలడని ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు అయ్యే శుభదినం నేడు!
పదహారు నెలల తరవాత క్విడ్ ప్రో కో లేదన్నది సిబిఐ. ఆధారాలేమి దొరక లేదన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చెయ్యలేదు కాబట్టి, ఆయన సంపాదించుకున్నది చాలామంది తెలివైన వ్యాపారవేత్తలు సంపాదించుకున్నంతే. ఆ సమయంలో వచ్చిన అవకాశాలతో చాలా మంది మన కళ్ళముందే కోట్లకి కోట్లు సంపాదించిన వైనం మనకి తెలుసు. క్విడ్ ప్రో కో జరిగింది, జగన్ లక్ష కోట్లు అవినీతితో సంపాదించాడని వండి వార్చిన యెల్లో మీడియా నోర్లు అయితే పనిచేస్తున్నాయి కాని ఇంతవరకు ఏ ఆధారాన్ని చూపించ లేదు, ఎందుకంటే ఏ ఆధారాలు లేవు కాబట్టి. కోర్టులను ప్రభావితం చేసే విధంగా ప్రాచారం చేసి, కోర్టులను పక్క దోవ పట్టించి రాష్ట్ర దేశ ప్రజల సమయాన్ని వృధా చేసిన చంద్రబాబు, యెల్లో మీడియా మీదే సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది! అక్రమంగా ఏ సాక్ష్యాలు లేకుండా విలువైన 16 నెలల సమయం కోల్పోయిన జగన్మోహన రెడ్డి గారికి ఏ విధంగా లెక్కగట్టి తిరిగి చెల్లించుకోగలరు ఈ సిబిఐ, ఈ రాజకీయ కుమ్మక్కు నాయకులు? కాని, అన్నిటికన్నా మనందరం గుర్తించిన విషయమేమంటే అక్రమ నిర్భందం చేసినా జగన్ మానసికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏ మాత్రం చెక్కు చెదరలేదు సరికదా ఇంకా దృఢమైన నాయకుడిగా తయారయ్యారు!
ఒక వర్గానికి దన్నుగా నిలిచే మీడియా వైఎస్సార్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డిపై ఏ చిన్న వివాదం పైనైనా ఏకంగా 14 న్యూస్ చానళ్ల కెమెరాలు ఎక్కుపెడతాయి. అవకాశం దొరికితే చీల్చి చెండడతాయి. అదే వైఎస్సార్ కాంగ్రెసుకుండే అనుకూల పరిస్థితి గురించి మాత్రం ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయదు. తాము మద్దతిచ్చే పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్నా ఆ పార్టీని వెనకేసురావడానికి, వెలిగిపోతోంది అంటూ అనుకూల సర్వేలను ప్రచారంలోకి తీసుకురావడానికి మాత్రం ముందుంటుంది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ మీడియా టార్గెట్ చేస్తోంది. అక్కడికీ సాక్షి పేపర్, సాక్షి టీవీ చానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని కూడా రాష్ట్ర, దేశ ప్రజలకు తెలిసేది కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి తరపున సాక్షి ఒంటరిపోరాటం చేస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెసులో చీమ చిటుక్కుమన్నా 14 న్యూస్ చానళ్లు, రెండు పెద్ద పత్రికలు నానా హైరానా చేస్తాయి. ఒకవేళ నామినేషన్ల కోలహాలంలోనూ, బీజేపీతో పొత్తు వ్యవహారంలోనూ తెలుగుదేశం పార్టీలో రేగిన వివాదాల వంటి వివాదాలే వైఎస్సార్ కాంగ్రెసులో గనుక రేగి ఉంటే నిజంగా వైకాపా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తెలుగుదేశం నేతల మధ్య విభేదాలున్నట్టుగా, తెలుగుదేశం నేతలు తన్నుకొన్నట్టుగా వైకాపా వాళ్లు తన్నుకొని ఉంటే వైఎస్సార్ కాంగ్రెసును మరో ప్రజారాజ్యం పార్టీలా చూపించేది ఈ మీడియా. జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండి అభ్యర్థులను ప్రకటించుకొని రెబల్స్ పోటు లేకుండా చేసుకొన్నాడు. జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి టాలెంట్ లేకపోతే ఈ మీడియా చేతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలి అయ్యేది. ఈ మీడియాకు మొత్తం ఇప్పుడు వైకాపాలోని లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి అనుకూలంశాల గురించి మాత్రం ఈ మీడియా ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. అంతదాకా ఎందుకు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకి జగన్, విజయమ్మ, షర్మిల, భారతి - నలుగురు తమ అత్యంత ముఖ్యమైన ప్రచారాన్ని మధ్యలో వదిలేసి రెండు రోజుల పాటు సమయాన్ని గడిపితే, ఇదే మీడియా జగన్ కుటుంబం అంత్యక్రియలకి హాజరుకాలేదని రాసింది! లక్ష కోట్ల అవినీతని ఇంటి కప్పుల మీద నుంచి అరిచినోల్లే లక్షల కోట్ల అవినీతి చేసారు. ఉదాహరణలు రామోజీరావు, చంద్రబాబు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సిఎం రమేష్, ఇంకా చాలా తెలుగుదేశం నాయకులు. ఈ రోజు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో పట్టుబడిన డబ్బే దీనికి సాక్షం. కాని, ఈ పచ్చ మేధావులకి ఇది అసలే పట్టదు! మీడియా అనుకూలంగా నిలిచినంత మాత్రాన పార్టీలు గెలిచేస్తాయని చెప్పడానికి లేదు. దీనికి గతంలోని అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెసుకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది!
ప్రజా వ్యతిరేక శక్తుల కుట్రలు, కుతంత్రాలు ఇక ఆగిపోతాయి అని అనుకోవడం ఎండమావుల్లో నీళ్ళు వెదుక్కోవడమే. వైఎస్సార్, జగన్ అభిమానులు విశ్రాంతి తీసుకోకుండా ఇంకా శ్రమించాల్సి వుంటుది. ఐదున్నర లక్షల మెజారిటీతో అఖండ విజయం సాధించిన, రాబోయే ఎన్నికల్లో మిగిలిన పార్టీలను తుడిచిపెట్టగల ఒక రాజకీయ పక్ష నాయకుడిని, ఒక ప్రజానాయకుడిని జైల్లో వేయడం ఒక ఎత్తైతే అదే జననేతని ఎదుర్కోలేక ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి కూడా వెనుకాడని దృష్ట రాజకీయ వ్యవస్త ఉన్నంత వరకు, ఆ వ్యవస్థని ఎల్ల వేలలా కాపాడటానికి నడుం కట్టిన ప్రజాస్వామ్య నాలగవ స్థంభం అయిన మీడియా ఉన్నంత వరకు వైఎస్సార్ అభిమానుల పోరాటం ఆగదు! ఇక చంద్రబాబు, యెల్లో మీడియా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. వైఎస్సార్, జగన్ మీద అర్ధం పర్ధం లేని అవినీతి ఆరోపణలు చెయ్యకుండా, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఉంటే ఈ రోజు వారికి పవన్ కళ్యాణ్, మోడీల మద్దతు కోసం నీఛానికి దిగజారే దుస్థితి వచ్చేది కాదు. ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయి వారి ఆస్థిత్వాన్నే కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇదీ చంద్రబాబు 30 యేల్ల వ్యూహ నైపుణ్యం! ఏ విధంగా చూసినా చంద్రబాబు అనే వ్యక్తి ఒక మామూలు నాయకుడు. అతనేమి వీరుడు, శూరుడు కాడు. అతనొక అహంకార, విలువలులేని, అల్ప అర్భక నేత! ఒక వర్గపు మీడియా ప్రచారంతో ఊదరకొట్టి ప్రజలని మభ్యపెట్టిందే గాని అంతక మించి ఒక్క అణా ఎత్తు కూడా ఎక్కువ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అధికార పక్షమైన కాంగ్రెస్తో కుమ్మక్కై నీతిబాహ్యంగా కుట్రలు చేసి ఒక ప్రజా నాయకుడిని కారాగారం పాలు చేసి, ఎన్నో కష్టాలు పెట్టి ఈ రోజు ఏ భేషిజం లేకుండా మాట్లాడగలిగే ఒక నీతి లేని రాజకీయ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుని, ఆయన్ని సమర్ధిస్తున్న మీడియాని చూస్తుంటే ప్రజలకి విస్మయం కలుగుతున్నది! దీన్ని బట్టి అర్ధమయ్యేదేంటంటే ఒకరు రాజకీయం ఊపిరిగా బ్రతుకుతుంటే, ఇంకొకరు ప్రజలకి సమర్ధవంతమైన నాయకత్వం వహిస్తున్నారు. ఆ సమర్ధ నాయకుడు అక్షరాలా దృఢమైన నాయకుడు - వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
జాబు కావాలంటే బాబు కావాలి అనే నినాదమిస్తున్న చంద్రబాబే మన రాష్ట్రంలోని ఎక్కువ ఉద్యోగాలు తొలిగించింది.  భద్రత కావాలంటే బాబు కావాలనే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది స్వయానా ఆయనే ముఖ్యమంత్రి అలిపిరిలో ఆయన కిందే బాంబు పెట్టినప్పుడు! ఏ చంద్రబాబుని హై టెక్ ముఖ్యమంత్రి అంటారో, ఆయన కాలంలోనే ఐటీ ప్రగతి మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది! సైబర్ టవర్స్ కట్టడంలో జరిగిన కుంభకోణాలకి అంతే లేదు. రాష్ట్ర నిర్మాణానికి బాబే కావాలనేవాళ్లకి ఈయన నిర్మించిన ప్రాజెక్టులు చూపించాడానికేమీ కనబడవు, ఎందుకంటే సైబర్ టవర్ తోబాటు ఎల్ అండ్ టీ కట్టిన ఎన్టీఆర్ భవన్ మాత్రమె ఉంది కాబట్టి. మోడీ ప్రధానమంత్రి అయితే మేము ప్రక్కనుండి నిధులు తెస్తాం అనే వాళ్లకి కనీసం ఐదన్నా ఎంపీలు ఉండాలి కదా? అవే లేనప్పుడు వీళ్ళకేమాత్రం విలువిస్తాడు మోడీ?
నమ్మిన సిద్ధాంతాల కోసం అవిశ్రాంతంగా, అహర్నిశలూ పోరాటం చేసి, పొత్తులు కోసం అర్రులు చాచకుండా, చావైనా రేవైనా అన్నట్టు మొత్తం శత్రువులు సంఘటితంగా వచ్చినా వెన్నుచూపని వైఎస్ జగన్మోహన్ రెడ్డే అసలు, సిసలు నాయకుడు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు మీద నమ్మకమున్న, పేద ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండగలిగిన,  ప్రజల సంక్షేమంలో రాష్ట్ర నిర్మాణంలో తను ఇచ్చిన హామీలకోసం ఎందాకైనా నడవగలిగేది ఒక్క జగనే! ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది మనకి!
- గురవా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అమెరికా
- See more at: http://telugu.greatandhra.com/politics/political-news/nayakudi-nalugella-porataniki-mana-sayam-nedu-52476.html#sthash.JrI3DYVM.dpuf
Share this article :

0 comments: