వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారం

వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారం

Written By news on Thursday, May 29, 2014 | 5/29/2014

వైఎస్ఆర్ సిపికి విప్ జారీ చేసే అధికారంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే అధికారం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్ సిపికి గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో ఈ  గుర్తింపు తక్షణమే అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

వైఎస్ఆర్ సిపికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితమే గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లభించే అన్ని అర్హతలు ఆ పార్టీకి లభించాయి. మునిసిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేసమయంలో ఈ పార్టీకి విప్ జారీ చేసే అధికారం కూడా లభించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Share this article :

0 comments: