వైఎస్సార్‌సీపీకి దక్షిణ భారత దళిత క్రిస్టియన్ అసోసియేషన్ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీకి దక్షిణ భారత దళిత క్రిస్టియన్ అసోసియేషన్ మద్దతు

వైఎస్సార్‌సీపీకి దక్షిణ భారత దళిత క్రిస్టియన్ అసోసియేషన్ మద్దతు

Written By news on Sunday, May 4, 2014 | 5/04/2014

దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేరుస్తానని ప్రకటించిన వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్నట్లు దక్షిణ భారత దళిత క్రిస్టియన్ అసోసియేషన్ ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ దళిత క్రైస్తవులకు అనుకూలంగా ఉండడంతోపాటు లౌకికవాద దృక్పథం కలిగి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన పార్టీ అని, అందుకే ఆ పార్టీకి అండగా నిలిచినట్లు సంఘం కన్వీనర్ నాగళ్ల పోచయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో జత కట్టిన తెలుగుదేశం పార్టీని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మే 7న సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిని ఓడించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: