పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ

పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ

Written By news on Thursday, May 8, 2014 | 5/08/2014

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 స్థానాలు
 జగన్ సీఎం అవడం ఖాయం: మైసూరారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ 25 లోక్‌సభ స్థానాలను, కనీసం 140 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంటుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, కె.శివకుమార్, చల్లా మధుసూదనరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు చారిత్రకమైనవని, పోలింగ్ సరళినిబట్టి రాష్ట్రవ్యాప్తంగా జగన్ పవనాలు వీస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పా రు. టీడీపీ నేతలు జనంలోకి వెళ్లినా వారికి స్పందన కరవైం దని, అందుకే చేతులెత్తేసి ఎన్నికల కమిషన్ అధికారులతో వాదులాటకు దిగుతున్నారని, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల  తీరునుబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయమైందనే విషయం వెల్లడవుతోందన్నారు. 25 లోక్‌సభ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చక్రం తిప్పుతుందని చెప్పారు.  
 
 పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ: గట్టు
 
 సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సరళి చూసిన తర్వాత టీడీపీ చేతులెత్తేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఓటమిని ముందే అంగీకరించిన ఆ పార్టీ నాయకులు ముఖం చాటేశారన్నారు. ఓటమికి గల కారణాలను బీజేపీ, పవన్‌కల్యాణ్‌పై నెట్టే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని గట్టు ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తీవ్ర ఒత్తిడికి లోనైన టీడీపీ నేతలు ఆఖరికి ఎన్నికల అధికారులపై దుర్భాషలాడుతూ దాడులకు దిగారన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఈసీ పట్ల వ్యవహరించిన తీరును స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తీవ్రంగా తప్పుబట్టడాన్ని చూస్తే వారి నైజం బయటపడిందన్నారు.
 
 ఓటమిని ఒప్పుకున్న టీడీపీ: వాసిరెడ్డి పద్మ
 
 సాక్షి, హైదరాబాద్: పోలింగ్ పూర్తవకముందే టీడీపీ ఓటమిని అంగీకరించిందని, అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఎల్లో మీడియా ద్వారా పోలింగ్ రోజున కూడా దుష్ర్పచారం చేయించిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.
Share this article :

0 comments: