పార్టీ వీడను, జగన్ కు అండగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ వీడను, జగన్ కు అండగా ఉంటా

పార్టీ వీడను, జగన్ కు అండగా ఉంటా

Written By news on Sunday, May 25, 2014 | 5/25/2014

'పార్టీ వీడను, జగన్ కు అండగా ఉంటా'
ఖమ్మం : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను పార్టీ వీడుతున్నట్లు ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఆదివారం ఖమ్మంలో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్ఫష్టం చేశారు.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడనని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు అండగా ఉంటానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాననని పొంగులేటీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతారంటూ ఎల్లో మీడియా ఇటీవల పలు వార్తా కథనాలు వెలువరించింది. ఈనేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.  
Share this article :

0 comments: