వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత

వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత

Written By news on Sunday, May 25, 2014 | 5/25/2014

వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని.. అవన్నీ ఊహాగానాలేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉండి పార్టీకి, ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి గీత..  ఫిరాయింపు ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఏడాదిన్నర క్రితమే అరకు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయమని వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోమారు గుర్తు చేశారు.
 
పార్టీలో ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఎస్టీ పార్లమెంటు సభ్యురాలిని తానేనన్నారు. వైఎస్సార్ సీపీని వీడతానని వార్తల రావడం బాధాకరమన్నారు.
Share this article :

0 comments: