వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మున్సిపాల్టీలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మున్సిపాల్టీలు

వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మున్సిపాల్టీలు

Written By news on Monday, May 12, 2014 | 5/12/2014

ANDHRA PRADESH

Party
Divisions
Won
Wards
Won
YSRCP62760
TDP851039
Cong234
BJP15
Others1794

TELANGANA

Party
Divisions
Won
Wards
Won
TRS39305
TDP1156
Cong43502
YSRCP010
Others39356










మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో హోరాహోరీగా ఫలితాలు సాధిస్తోంది. సోమవారం మున్సిపల్ కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు వెలువడుతున్నాయి. సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, ఇచ్చాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లతో పాటు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఇక తుని, పులివెందుల, బొబ్బిలి మున్సిపాల్టీలతో పాటు కడప, ఏలూరు కార్పొరేషన్లలో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కడపటి సమాచారం అందేసరికి ఫలితాలు..
జిల్లాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గిన మున్సిపాల్టీలు

ప్రకాశం: చీరాల, గిద్దలూరు

కర్నూలు: ఆళ్లగడ్డ

కడప: ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు

శ్రీకాకుళం: ఇచ్చాపురం, ఆముదాలవలస

తూర్పుగోదవరి: గొల్లప్రోలు

గుంటూరు: చిలకలూరిపేట
విజయనగరం: బొబ్బిలి

కడప : కడప కార్పొరేషన్ ఎన్నికల్లో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11, టీడీపీ మూడు వార్డులు విజయం సాధించింది. కడప 7వ వార్డు టీడీపీ మేయర్ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట రమణ గెలుపొందాడు. కాగా కడప మేయర్ అభ్యర్థి సురేష్ బాబు 1900 ఓట్లతో విజయం సాధించాడు.
Share this article :

0 comments: