కార్యకర్తలకు అండగా ఉంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం

Written By news on Sunday, May 18, 2014 | 5/18/2014

కార్యకర్తలకు అండగా ఉంటాం
  •   వారిని ఇబ్బందిపెడితే సహించం
  •   మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత సారథి
 పామర్రు, న్యూస్‌లైన్ : తమ కార్యకర్తలను టీడీపీ నాయకులు ఇబ్బందిపెడితే సహించేదిలేదని, తగిన విధంగా స్పందించేందుకు వెనుకాడేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి అన్నారు. తమ కార్యకర్తలపై దాడులకు తెగబడినా, కేసులు పెట్టి వేధిం చినా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. పామర్రు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఉప్పులేటి కల్పనకు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చి వైఎస్సార్ సీపీకి విజయం చేకూర్చేం దుకు పార్టీ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జిల్లాలో తాను ఓడినప్పటికీ ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులకు, ఇందుకోసం అహర్నిశలూ శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా పోరాడతామని ప్రకటించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు. హామీల అమలుకోసం తమ వంతు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ పదేళ్లుగా తాను పడిన కష్టాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించారని సంతోషం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ తోట్లవల్లూరు, మొవ్వ మండలాల కన్వీనర్లు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, చిందా బుజ్జి, పార్టీ నాయకుడు కిలారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: