ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం

ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం

Written By news on Tuesday, May 27, 2014 | 5/27/2014

ఎన్ని కష్టాలెదురైనా జగన్ వెంటే నడుస్తాం
కార్యకర్తల వెన్నంటి ఉంటా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్:  టీడీపీ నాయకుల్లా స్వప్రయోజనాల కోసం అమ్ముడుపోయే వారు వైఎస్సార్‌సీపీలో ఎవరూ లేరని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే నడుస్తామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు.
 
స్థానిక మాదాల చంద్రశేఖర్ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో అనిల్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ పార్టీని వదిలి టీడీపీలో చేరనున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. చంద్రబాబుకు మెజార్టీ రావడంతోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయన్నారు. తాను గెలిచానన్న ఆనందం కంటే జగనన్నను సీఎం చేయలేకపోయామనే బాధ వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్‌ను కల్పిస్తే జగనన్న ఎమ్మెల్యేను చేశారన్నారు.

ఎమ్మెల్యే అన్న మూడు అక్షరాలే చేరాయి..
అనిల్ పేరుకు ఎమ్మెల్యే అనే మూడు అక్షరాలు చేరాయే తప్ప తన జీవితంలో ఎలాంటి మార్పులేదన్నారు. ఏమైపోతామో, ఏమవుతోందో తెలియని రోజు నుంచి తనతోపాటు పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల వెంటే నడుస్తామని వాగ్దానం చేశారు.
 
అబ్దుల్‌అజీజే మేయర్..
జగనన్న ఇచ్చిన మాట మేరకు అబ్దుల్‌అజీజ్ నగరపాలక సంస్థ మేయర్ కావ డం ఖాయమన్నారు. అలా కాని పక్షం లో మహానాయకుడు వైఎస్సార్‌కు ద్రో హం చేసినవారమవుతామన్నారు. ఆగ స్టు నుంచి మిషన్-2019 పేరుతో జగనన్నను సీఎం చేసేందుకు రెట్టించిన అంకితభావంతో కృషి చేస్తానన్నారు. కార్పొరేటర్ రూప్‌కుమార్ మాట్లాడుతూ అనిల్‌కుమార్‌యాదవ్ విజ యం యువతదేనన్నారు. కార్పొరేటర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రారంభం నుంచి అనిల్‌కుమార్‌యాదవ్ పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కిందన్నారు.

 
 ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పుట్టా రామకృష్ణారెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మునీర్‌సిద్ధిఖ్, దార్ల వెంకటేశ్వర్లు, కర్తం ప్రతాప్‌రెడ్డి, షేక్ సుభాన్, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఎం విజయభాస్కర్ రెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఆర్ ఇంతియాజ్, రవిచంద్ర, గూడూరు శ్రీధర్‌రెడ్డి, దామవరపు రాజశేఖర్, టి.రఘురామిరెడ్డి, యూ మాధవయ్య, జి.వెంకటేశ్వర్లు, అతహర్, వి.మహేష్, టి.శ్రీనివాసులు, వందవాసి రంగ, ఎం ప్రశాంత్, డి.అశోక్, గంధం సుధీర్‌బాబు, ఎండీ తారిఖ్, ఆర్ జెస్సీ, లలిత పాల్గొన్నారు.
Share this article :

0 comments: