17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!!

17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!!

Written By news on Wednesday, June 25, 2014 | 6/25/2014

17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!!టీడీపీ దాడిలో గాయపడ్డ ఈశ్వరయ్య (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరణించారు. 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నెలరోజుల్లో సాధించిన ప్రోగ్రెస్ కార్డ్. ఈ వివరాలను అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినట్లు తెలియగానే తెలుగు తమ్ముళ్ల అరాచకాలు మొదలైపోయాయి.

మొట్టమొదట పవిత్ర క్షేత్రమైన తిరుమల కొండ మీద ఉన్న దుకాణాలను ధ్వంసం చేసి తమ ప్రతాపం చూపించారు. అక్కడి నుంచి వాళ్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రకాల తోటలను ధ్వంసం చేశారు. నిమ్మ, నారింజ, అరటి తోటలను ఎడా పెడా నరికేశారు. చెట్ల పాదుల్లో కిరోసిన్ పోసి మరీ వాటిని మళ్లీ బతకకుండా చేశారు. అనంతపురం జిల్లాలో ఓ వైఎస్ఆర్ సీపీ నేత ఇంట్లో అయితే ఏకంగా టైంబాబు పెట్టారు!!

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని చిగురుమానుపేటలోని అమ్మ హోటల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కొందరు రౌడీమూకలు తప్పతాగిన మైకంలో కత్తులు, రాడ్లతో దాడి చేశారు. రౌడీ మూకల దాడిలో గాయపడ్డ ఉప్పరి ఈశ్వరయ్య కడుపులో కత్తిపోటు పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో చోటుచేసుకుంది. అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్ ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో మద్యం బాటిళ్లతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో వైఎస్ విగ్రహం పాక్షికంగా దెబ్బతింది.

ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక రకాల దౌర్జన్యాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్పడుతున్నా, పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకుల్లాగే మిగిలిపోయారు.
Share this article :

0 comments: