శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి

శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: శోభానాగిరెడ్డి తనకు భార్య మాత్రమే కాదని మంచి స్నేహితురాలు కూడా అని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... చాలా బాధతో అసెంబ్లీలో నిలుచున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు.

రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా కుటుంబాన్ని ఆమె నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అన్ని విషయాలపై తామిద్దరం మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ప్రతి విషయంపై చర్చించుకున్న తర్వాత తమ దినచర్య మొదలయ్యేదని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ఎంతో తపించేవారని తెలిపారు. తనను మించి నాయకురాలిగా ఎదిగారని ప్రశంసించారు. శోభ భర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తామిద్దం అసెంబ్లీలో ఉండి జగన్ కు అండదండగా ఉండాలని శోభ ఆలోచించారని, కానీ ఆమె మనమధ్య లేకుండా వెళ్లిపోయారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాగిరెడ్డి ప్రార్థించారు.
Share this article :

0 comments: