సహాయక చర్యల్లో పాల్గొనాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సహాయక చర్యల్లో పాల్గొనాలి

సహాయక చర్యల్లో పాల్గొనాలి

Written By news on Monday, June 9, 2014 | 6/09/2014

ఉమ్మడిగా తక్షణ చర్యలు తీసుకోవాలి
సహాయక చర్యల్లో పాల్గొనాలి: ఢిల్లీలోని వైసీపీ నేతలకు జగన్ ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్‌లోని కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా చొరవ తీసుకుని సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించాల్సిన అవసరముందన్నారు. 126 మెగావాట్ల లర్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు కింద విద్యుత్ ఉత్పత్తి కోసం ఒక్కసారిగా నదిలోకి నీటిని వదిలినట్టు ప్రమాద తీరును బట్టి తెలుస్తోందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయని అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని జగన్ పేర్కొన్నారు.
 
అప్రమత్తం చేసే వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతోందన్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ముమ్మ రం చేయించడంతో పాటు వీలైనంత మేరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఢిల్లీలో ఉన్న పార్టీ నేతలను జగన్ ఆదేశించారు.బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు ప్రమాదానికి గురికావడం తనను ఎంతో కలచి వేస్తోందన్నారు.
Share this article :

0 comments: