వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదు

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదు

Written By news on Saturday, June 14, 2014 | 6/14/2014

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలను కించపరుస్తూ వెబ్ సైట్లలో దుష్ప్రచారంపై ఆపార్టీ నేతలు శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు ఈరోజు ఉదయం సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోందని, దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరామన్నారు. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారని, అది చాలా బాధాకరమన్నారు. 20-25 వెబ్ సైట్లలో పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి షర్మిల ప్రచారం చేస్తున్నారనే ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కాగా  షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన  ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేశ్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్తీక్‌లు.. మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  అప్పట్లో ఈ ఉదంతంపై వైఎస్సార్ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు నెల క్రితమే ఒకర్ని పట్టుకోగా.. తాజాగా శ్రీపతి నరేశ్, కార్తీక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీఎస్ డీసీపీ పాలరాజు శుక్రవారం తెలిపారు.
ఫిర్యాదు పూర్తి పాఠం ఈ దిగువన చూడండి..
ఒకటో పేజీ
రెండో పేజీ
మూడో పేజీ
నాలుగో పేజీ
ఐదో పేజీ
Share this article :

0 comments: