ఓవైపు చందాలడుగుతూ... మరోవైపు ఆర్భాటమా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓవైపు చందాలడుగుతూ... మరోవైపు ఆర్భాటమా!

ఓవైపు చందాలడుగుతూ... మరోవైపు ఆర్భాటమా!

Written By news on Sunday, June 8, 2014 | 6/08/2014

ఓవైపు చందాలడుగుతూ... మరోవైపు ఆర్భాటమా!
గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు
 
 హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఓవైపు చందాలడుగుతూ మరోవైపు ఇంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం చేయడం సబబేనా? అని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే... సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిలాంటి పెద్దలు రెచ్చిపోయి మాట్లాడిన తీరు, వాడిన భాష గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం తప్పవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం విభజనకులోనై కష్టాల్లో ఉన్నపుడు ఇంత  ఆర్భాటం ఎందుకని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారా? అని టీడీపీ నేతలను నిలదీశారు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోకుండా ఉంటే మంత్రి పదవి వచ్చి ఉండేదన్న బాధతో సోమిరెడ్డి ఉన్నారని, అలాంటి రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఇలాంటి విమర్శలు చేసినట్లుగా ఉందని విమర్శించారు.  ఇంకా ఆయనేమన్నారంటే...

1. చంద్రబాబు అనేకసార్లు ఫోన్లు చేసినా జగన్ స్పందించలేదని ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలో గత మూడు రోజులుగా ఉదయం పది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున ఐదు గంటల వరకూ పార్టీ సమీక్షా సమావేశాల్లో జగన్ తలమునకలుగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వద్ద ఫోన్ ఉండదు. చంద్రబాబు ఫోన్ చేయగానే జగన్ శుభాకాంక్షలు చెప్పారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ వాళ్లు మాత్రం పనిగట్టుకుని జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు.
2. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత అట్టహాసంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రమాణం కోసం పేదల గుడిసెలను సైతం కూల్చేసి అక్కడినుంచి వారిని పంపేశారు. తాను కనుక హాజరైతే వాటన్నింటింకీ ఆమోదం తెలిపినట్లవుతుందనే ఉద్దేశంతో జగన్  వెళ్లదల్చుకోలేదు.

 వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయగలరా?

1. తానేదో నిజాయితీపరుడనని చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేయలేదని కలియుగ ప్రత్యక్ష దైవమైన  వెంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేసి చెప్పగలరా?
2. జగన్ అవినీతిపరుడైతే, కోట్లాది రూపాయల డబ్బు అయన వద్ద ఉండి ఖర్చు చేసి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు. జగన్‌పై సీబీఐ అక్రమంగా కేసులు మోపి 16 నెలలు జైల్లో ఉంచిన తరువాత కూడా అంతిమంగా చార్జిషీట్లు వేసేటపుడు ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. చంద్రబాబు తనపై విచారణ జరక్కుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకోకపోయి ఉంటే ఆయన బండారం ఏమిటో బయటపడే
Share this article :

0 comments: