బాబు వచ్చాడు.. జాబు పోయింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వచ్చాడు.. జాబు పోయింది

బాబు వచ్చాడు.. జాబు పోయింది

Written By news on Monday, June 23, 2014 | 6/23/2014

బాబు వచ్చాడు.. జాబు పోయింది: వైఎస్ జగన్
హైదరాబాద్ : బాబు వస్తాడు.. జాబు వస్తుందని పదే పదే ప్రకటనల్లో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బాబు వచ్చిడు.. ఉన్న జాబు పోయిందనేలా ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలు లేవనెత్తారు. అందులో భాగంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ఆయన ప్రస్తావించారు.

బాబు వస్తాడు.. జాబు వస్తుందని అప్పట్లో చెప్పారని, కానీ ఇప్పుడు చూస్తే బాబు వచ్చాడు.. ఉన్న జాబు పోయినట్లుందని అన్నారు. ఆదర్శరైతులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇలా అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని, వాళ్లెవరూ కనీసం మనుషుల్లా కూడా కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు జోక్యం చేసుకుంటూ తమ జిల్లాలో గతంలో పొలం అమ్మేసుకుని విశాఖ వెళ్లి కాంట్రాక్టులు చేసుకుంటున్న వ్యక్తిని ఆదర్శరైతుగా నియమించారని చెప్పారు. అయితే, ఆదర్శరైతులను ఆయా జిల్లాల కలెక్టర్లే స్వయంగా నియమించారని అందుకు జగన్ దీటుగా సమాధానం ఇచ్చారు.
Share this article :

0 comments: