ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

Written By news on Thursday, June 12, 2014 | 6/12/2014

న్యూఢిల్లీ : నంద్యాల ఎంపీ ఎస్ పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పిటిషన్ అందించింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు...స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీలో చేరినట్లు ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.

అనర్హత వేటు వేస్తే టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినట్లు మేకపాటి తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని స్పీకర్ తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి  విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Share this article :

0 comments: