ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

Written By news on Sunday, June 8, 2014 | 6/08/2014

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ఖమ్మంహవేలి, న్యూస్‌లైన్: తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తొలిసారిగా శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతు సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు.

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజల పక్షాన పోరాడుతానని అన్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు లక్షరూపాయలలోపు ఉన్న అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు ఈ  సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్ అమలు చేస్తారనే ఆశాభావాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విధంగా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉంటుందని, తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే అధినేత ప్రకటిస్తారని అన్నారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పార్టీ శాసన సభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉపనేత పాయం వెంకటేశ్వర్లు, విప్ బాణోత్ మదన్‌లాల్, ఇల్లెందు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ రవిబాబునాయక్, కూరాకుల నాగభూషణం, డాక్టర్ మట్టాదయానంద్ విజయ్‌కుమార్, యువజన విభాగం మూడు జిల్లాల సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి ఉన్నారు.
Share this article :

0 comments: