కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ

కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ

Written By news on Friday, June 20, 2014 | 6/20/2014

కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డి దంపతులు గురువారం తిరుమల శ్రీవారికి కాలినడక మొక్కు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. ప్రస్తుతం శబరిమలై యాత్ర ముగించుకున్న వైవీ సుబ్బారెడ్డి తిరుమలేశునికి కాలినడక, తలనీలాల మొక్కులు చెల్లించేందుకు సతీసమేతంగా శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమల చేరుకున్నారు.

ఆ తర్వాత అతిథిగృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, స్వర్ణలతారెడ్డి మూడు కత్తెర్లతో తలనీలాల మొక్కు చెల్లించారు. వీరు శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుంటారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఆయన శబరిమలై నడకతోపాటు తిరుమల కాలిబాటలో నిటారైన సుమారు 3 వేలకుపైగా మెట్లు ఎక్కి తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించి యాత్రను పరిపూర్ణం చేసుకోవడం గమనార్హం.
Share this article :

0 comments: