తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్

తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టనున్నారు. అసెంబ్లీ సభ్యుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి ఆయన శాసనసభకు వస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్  మొదటిసారి శాసనసభకు విపక్ష హోదాలో హాజరు అవుతున్నారు. దాంతో అందరి చూపు వైఎస్ జగన్ పైనే కేంద్రీకృతమై ఉంది.

కాగా గతంలో కడప లోక్ సభ నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన వైఎస్ జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి తొలిసారి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొందారు.  వైఎస్ జగన్ 75 వేల ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ వి సతీష్ రెడ్డిపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: