నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు

నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు

Written By news on Saturday, June 28, 2014 | 6/28/2014

నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
నగరం: గ్యాస్ ఉత్పత్తిలో గానీ, పంపిణీలో గానీ ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా నష్టపోయేది రాష్ట్రమేనని,  గ్యాస్ లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు.  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన  ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. ఇక్కడ గ్యాస్ లీకవుతుంటే పట్టించుకునేవారు లేరన్నారు.

సింగరేణి కాలరీస్ లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం  వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు.  కేంద్రంను అడిగి గ్యాస్ లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును  జగన్ కోరారు.

ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: