గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం

గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాం

Written By news on Monday, June 23, 2014 | 6/23/2014

గవర్నర్ ప్రసంగానికి పరిమితం అవుదాంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం జరగాలన్న విషయమై చర్చిద్దామని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ ప్రారంభించడానికి బదులు, గవర్నర్ ప్రసంగంలో అంశాలను ప్రస్తావించడానికి బదులు.. తెలుగుదేశం పార్టీ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద, నాటి పాలనా కాలం మీద పదేపదే వ్యాఖ్యలు చేస్తుండటంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభకు ఈ రకంగా విజ్ఞప్తి చేశారు.

రైతులకు అనేక సమస్యలున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా ఇతర అంశాలవైపు వెళ్లడం సరికాదని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు పరిమితం అవుదామని ఆయన సూచించారు. గనుల కేటాయింపుల గురించి ప్రస్తావించాల్సి వస్తే, అది చంద్రబాబునాయుడు పాలనా కాలం వరకు వెళ్తుందని, తవ్వితే అన్నీ బయటపడతాయని చెప్పారు. ధూళిపాళ్ల నరేంద్ర కావాలనుకుంటే దానిమీద ప్రత్యేకంగా చర్చ చేసుకోవచ్చు గానీ, అసలు గవర్నర్ ప్రసంగానికి, దీనికి సంబంధం ఏమిటో.. అసలు చర్చ ఎలా సాగుతోందో, ఎటు వెళ్తోందో చెప్పలేకపోతున్నామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Share this article :

0 comments: