ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

Written By news on Thursday, June 12, 2014 | 6/12/2014

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
హుజూర్‌నగర్:ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ నిరంతరం కృషి చేస్తుం దని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం స్థాని క పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం స్థాపించిన వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుం దన్నారు. ప్రజల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో పార్టీని ఆదరించి ఓట్లు వేసిన ప్రజలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు గాను రైతులు ఎదుర్కొం టున్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీ పథకంపై స్పష్టమైన ప్రకటన చేసి రైతులలో నెలకొన్న ఆందోళనను తొలగించాలన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎంపీ పీ ఎన్నికలలో పార్టీ పక్షాన గెలిచిన ఎంపీటీసీలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆ పార్టీ హుజూర్‌నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులు,జాల కిరణ్, సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: