ఎర్రదొంగలకు బాబు దన్ను? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎర్రదొంగలకు బాబు దన్ను?

ఎర్రదొంగలకు బాబు దన్ను?

Written By news on Friday, June 27, 2014 | 6/27/2014

ఎర్రదొంగలకు బాబు దన్ను?
* చంద్రబాబును కలిసిన రెడ్డినారాయణ భార్య, మహేష్ తండ్రి
* బెయిల్ కోసం చంద్రబాబుకు వినతి
* అన్నీ తెలుసునని బాబు భరోసా
 
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు, భాస్కర్‌నాయుడుకు తెలుగుదేశం పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. వీరిని స్మగ్లింగ్ కేసుల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పలు కేసులు ఉన్న రెడ్డినారాయణ, మహేష్ నాయుడు, భాస్కర్ నాయుడుపై పీడీ యాక్ట్ అమలులో ఉంది. వీరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

పీడీ యాక్ట్ నుంచి వారిని బయటపడే సేందుకు కుటుంబ సభ్యులు టీడీపీ నేతల సహకారం కోరారు. టీడీపీ నేతల సమాచారం మేరకు... మహేష్ నాయుడు, రెడ్డినారాయణ భార్యలు వారం రోజుల కిందట ఎంపీ సీఎం రమేష్ భార్యతో కలసి చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన తమ భర్తలకు అండగా నిలవాలని చంద్రబాబును కోరారు. ఇదే విషయాన్ని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా విన్నవించుకున్నారు. వారిద్దరూ వీరికి అభయహస్తం ఇచ్చినట్లు చెబుతున్నారు. గురువారం పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. 

రిమాండ్‌లో ఉన్న రెడ్డినారాయణ, భాస్కర్ నాయుడు, మహేష్ నాయుడును కూడా హాజరయ్యారు.  అంతకు ముందురోజు... బుధవారం రెడ్డినారాయణ భార్య, మహేష్ నాయుడు తండ్రి తమ అనుచరులతో సీఎం చంద్రబాబును కలిశారు. పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డులో ఎలాగైనా బెయిల్ వచ్చేలా ప్రయత్నించాలని వారు బాబుకు విన్నవించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. వారు చెప్పింది సావధానంగా విన్న చంద్రబాబు అన్నీ నాకు తెలుసు.. నేను చూసుకుంటానని.. అని భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
 
బెయిల్ కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాల్సిందే
తమ వారికి బెయిల్ ఇప్పించాలని వీరు చంద్రబాబుతోపాటు పొరుగు జిల్లాకు చెందిన ఓ ఎంపీని కలసి విన్నవించారు. తాము ఈ స్థాయికి రావడానికి రూ.వంద కోట్లు ఖర్చు అయిందని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా పనులు చేసుకుంటూపోతే కుదరదని సదరు ఎంపీ వీరికి చెప్పినట్లు తెలిసింది.  పీడీ యాక్ట్ నుంచి బయటపడి బెయిల్ రావాలంటే ఒక్కొక్కరు రూ. ఐదు కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది. రెడ్డినారాయణ, మహేష్ నాయుడు కుటుంబ సభ్యులు అతనితో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
Share this article :

0 comments: