వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి

వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి

Written By news on Monday, June 9, 2014 | 6/09/2014

వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి
నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: చిన్నపిల్లలు తిరుగుతున్నారు .. జాగ్రత్తగా ద్విచక్రవాహనాలు నడపండి అన్న పాపానికి ఆదివారం దొండపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దొండపాడు గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి వెళ్లే క్రమంలో ద్విచక్రవాహనాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
 
 కాగా చిన్న పిల్లలున్నారు .. జాగ్రత్తగా వాహనాలు నడపమని హితవు పలికిన పాపానికి గ్రామానికి చెందిన ముచ్చుమర్రు వెంకటసుబ్బారెడ్డి, అతని కుమారుడు వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిలపై దాడి చేసి గాయపరిచారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జక్కిరెడ్డి నాగేశ్వరరెడ్డి, చిన్నపరెడ్డి నరేంద్రరెడ్డి, చిన్నపరెడ్డి హనిమిరెడ్డి, జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నవులూరి తిరుపతిరెడ్డిలపై కూడా దాడి చేశారు. దాడిలో ముచ్చుమర్రు వెంకటరెడ్డి, ముచ్చుమర్రు వెంకటసుబ్బారెడ్డి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని గ్రామస్తులు ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు. వీరి తండ్రి ముచ్చుమర్రు వెంకట సుబ్బారెడ్డికి చెయ్యి విరిగింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.
 
 విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏరియా వైద్యశాలకు తరలివచ్చి బాధితులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల నుంచి నరసరావుపేట నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని, ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందన్న అహంకారంతో కొందరు గ్రామాల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులను పరామర్శించిన వారిలో రొంపిచర్ల మండల కన్వీనర్ పిల్లి ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దేశిరెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నూరుల్ అక్తాబ్, మూరె రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: