సార్వత్రిక ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సార్వత్రిక ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్ష

సార్వత్రిక ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్ష

Written By news on Wednesday, June 4, 2014 | 6/04/2014

రాజమండ్రి : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటములపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్షిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గాల సమీక్షలు జరుపుతున్నారు. తొలిరోజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష ముగిసింది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై విశ్లేషణ జరపనున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిని జగన్ చర్చిస్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించే విధంగా, ప్రజల పక్షాన నిలిచి నిర్మాణాత్మకంగా వ్యవహరించే దిశగా క్యాడర్‌ను ఆయన ఉత్తేజపరచనున్నారు. నేటి నుంచి మూడురోజుల పాటు వరుసగా ఈ సమీక్షలు కొనసాగనున్నాయి.

ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ ప్రత్యేక బృందాలు పర్యటించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులపై బృందాలు అధినేతకు నివేదికలు సమర్పించాయి. వాటిని అధ్యయనం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి నేతలతో చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పది పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమీక్షలకు హాజరయ్యారు. వీరందరితో అధినేత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా విడివిడిగా సమావేశమై ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా ఘన స్వాగతం పలికారు.  అక్కడి నుంచి జగన్ రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి చేరుకున్నారు.
Share this article :

0 comments: