స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా?

స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా?

Written By news on Monday, June 23, 2014 | 6/23/2014

స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక అటువైపు ఉన్నారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ఇరుపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో, ఇచ్చిన హామీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుతగిలారు. వైఎస్ జగన్ ప్రసంగాన్ని కూడా స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ రెడ్డి కూడా అనుమతించకపోవడంపై వైఎస్ జగన్ స్పందించారు. 
 
స్పీకర్ సార్.. స్పీకర్ స్థానంలో ఉన్నారా? లేక మీరు ఇంకా అటువైపు ఉన్నారా అంటూ తెలుగుదేశం సభ్యులను చూపిస్తూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అందుకు స్పీకర్ కోడెల సమాధానమిస్తూ.. నేను అటూ లేను ఎటూ లేను.. అని వ్యాఖ్యానించారు. స్పీకర్ స్థానంలో తాను ఇరుపక్షాలకు మధ్యవర్తిగా ఉన్నాననే విధంగా స్పందించడంతో సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు. 
Share this article :

0 comments: