మండి కలెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మండి కలెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం

మండి కలెక్టర్ పై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆగ్రహాం

Written By news on Tuesday, June 10, 2014 | 6/10/2014

హిమాచల్ ప్రదేశ్ : బియాస్ నది దుర్ఘటనలో మునిగిపోయిన విద్యార్థుల ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలు వేగవంతం చేయాలని మండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతుపై మంగళవారం మండిలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్లంతైన విద్యార్థుల విషయం జిల్లా యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తుందని వైఎస్ఆర్ ఎంపీలు ఆరోపించారు. సంఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇంకా విద్యార్థులను గుర్తించకపోవడం ఏమిటని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పై మండిపడ్డారు. 
Share this article :

0 comments: